Begin typing your search above and press return to search.
నెలలో మూడోసారి.. అమెరికాలో కాల్పుల మోత..
By: Tupaki Desk | 2 Jun 2022 4:10 AM GMTఅమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రి క్యాంపస్ భవనంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
దుండగుడి కాల్పుల్లో మొదట ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు మృతిచెందారు. అర్థోపెడిక్ సర్జన్ కోసం వచ్చిన షూటర్ డాక్టర్ కనిపించలేదని విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల తర్వాత తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక కాల్పులు జరిపేందుకు వచ్చిన దుండగుడు కూడా చనిపోయినట్లు సమాచారం. కాల్పులు జరిగే సమయంలో భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ విచారం వ్యక్తం చేశాడు. కాల్పులు దురదృష్టకరమన్నారు.
నాలుగు రోజుల కిందటే అమెరికాలోని ఓ స్కూల్లో దుండగుడు కాల్పులు జరిపి చిన్నారుల ప్రాణాలు తీశాడు. టెక్సాస్‌లోని ఉవాల్డే పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ కాల్పులు జరపడంతో శుక్రవారం 19 మంది పిల్లలు మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణం మరిచిపోకముందే మరోసారి అమెరికా నెత్తూరోడడం దుండగుడు ఆస్పత్రిలో జరిపిన కాల్పుల్లో మరోసారి నలుగురు మృతిచెందడం విషాదం నింపింది.
మే 16న కూడా న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన ఘటన మరువక ముందే మరోసారి తుపాకీ మోతలతో అమెరికా దద్దరిల్లింది.ఇలా గన్ కల్చర్ తో అమెరికాలో మరణ మృదంగం వినిపిస్తోంది.