Begin typing your search above and press return to search.
మోడీకి ఆ సీఎం సో.. స్పెషల్
By: Tupaki Desk | 9 May 2017 7:48 AM GMTముఖ్యమంత్రులందు యూపీ ముఖ్యమంత్రి వేరయా? అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. తాను ఏరికోరి ఎంపిక చేసిన యూపీ సీఎం అదిత్యనాథ్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు ప్రధాని మోడీ. ఆయన కోరుకున్నవన్నీ ఇట్టే సమకూరుస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. వీరి మాటలకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ పాలనలో పూర్తి మార్పులు తెచ్చేందుకు అదిత్యనాథ్ విపరీతంగా ట్రై చేస్తున్నారు.
ఇందులో భాగంగా తాను పవర్ లోకి వచ్చిన యాభై రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి చెందిన 200 మంది ఐఏఎస్.. ఐపీఎస్ లను బదిలీ షాక్ రుచి చిఊపించిన ఆయన.. పాలనను ఒక గాడిన పెట్టేందుకు వీలుగా కరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా తనకు పది మంది అదనపు అధికారులు కావాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి అదిత్యనాథ్ కోరినట్లుగా తెలుస్తోంది.దీనిపై రియాక్ట్ అయిన ప్రధాని.. తాజాగా ఐదుగురు అధికారుల్ని కేటాయించటం గమనార్హం.
రాష్ట్రంలో పాలనా పరంగా పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావటం.. అభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా సమర్థులైన అధికారుల అవసరాన్ని గుర్తించిన యోగి.. ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లటం.. మొత్తం 30 మంది అధికారుల జాబితాను ఆయన ముందు పెట్టగా.. వారిలో పది మందిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి దశలో ఐదుగురు అధికారుల్నియూపీకి పంపిన మోడీ.. త్వరలోనే మరో ఐదుగురు అధికారుల్ని పంపనున్నట్లు తెలుస్తోంది. ఇలా.. యూపీ సీఎం ఏం కోరితే.. ఆ పనిని మోడీ వెనువెంటనే పూర్తి చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.