Begin typing your search above and press return to search.
13వ సారి కూడా అగ్రస్థానం అంబానీదే .. టాప్ 10 లో ఎవరున్నారంటే?
By: Tupaki Desk | 8 Oct 2020 11:50 AM GMTరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత , ముఖేష్ అంబానీ ఇండియా టాప్ 100 ధనవంతులు జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. కరోనా, లాక్ డౌన్ తో ఇతరుల ఆదాయం తగ్గిపోతే ముకేశ్ అంబానీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. కరోనా సమయంలో దూసుకుపోయిన సంస్థ .. దేశంలో అప్పులు లేని కంపెనీగా రిలయన్స్ సంస్థ నిలిచింది. జియో అంబానీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. టెలికాం రంగంతో పాటుగా జియో సంస్థ రెటైల్ మార్కెట్ రంగంలోకి ప్రవేశించడంతో ఇందులో పెట్టుబడుల్లో పెట్టేందుకు బడా సంస్థలు ముందుకు రావడంతో రిలయన్స్ ఆదాయం భారీగా పెరిగింది.
ఫోర్బ్స్ సంస్థ ఇండియాలో టాప్ 100 ధనవంతులు జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇలా ఇండియాలో టాప్ ప్లేస్ లో నిలవడం వరసగా ఇది 13 వ సారి. రిలయన్స్ అంబానీ 88.7 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 25.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. శివ నాడార్ 20.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, రాధాకృష్ణన్ దామని 15.4 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. హిందుజా బ్రదర్స్, సైరస్ పూనావాలా, పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్ కోటక్, గోద్రెజ్ ఫ్యామిలీ, లక్ష్మి మిట్టల్ లు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.