Begin typing your search above and press return to search.
వీడు మనిషేనా.. 8 ఏళ్లలో 14 సార్లు బలవంతపు అబార్షన్.. చివరకు సూసైడ్
By: Tupaki Desk | 15 July 2022 4:09 AM GMTకొన్ని ఉదంతాలు విన్నంతనే ఒళ్లు జలదరించటంతో పాటు.. అయ్యో అన్న మాట అప్రయత్నంగా వస్తుంది. మనసును తెగ బాధ పెట్టేయటమే కాదు.. ఒక మనిషికి ఇన్ని కష్టాలా? అన్న భావన కలుగక మానదు. తాజాగా చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. మనసారా నమ్మి.. ప్రేమించిన వ్యక్తి మాటల్ని ఇష్టం ఉన్నా లేకున్నా అతని మాటను విన్నపాపానికి ఒక మహిళకు చివరకు ఆత్మహత్యే శరణ్యమైంది. ఈ ఉదంతం గురించి విన్నంతనే.. అసలు ఆ వ్యక్తి మనిషేనా? అన్న సందేహం కలుగక మానదు.
తనతో సహజీవనం చేస్తున్న మహిళకు ఎనిమిదేళ్ల వ్యవధిలో 14 సార్లు అబార్షన్ చేయించిన దుర్మార్గుడి ఉదంతమిది. సహజీవనం చేస్తున్న అతగాడు.. తన కామవాంఛల్ని తీర్చుకున్నాడే కానీ.. పెళ్లి చేసుకోవటానికి మాత్రం ముఖం చాటేశాడు. దీంతో.. ఆమె మనోవ్యధకు గురై తనువు చాలించింది. ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న మహిళకు పరిచయమయ్యాడు బిహార్ కు చెందిన గౌతమ్.
అతని మాటలకు నమ్మిన ఆమె.. అతనితో భవిష్యత్తును ఊహించుకొని సహజీవనం షురూ చేసింది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల వ్యవధి లో ఏకంగా 14 సార్లు బలవంతపు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇన్నిసార్లు తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న వైనంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అతడ్ని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో.. అతను తన అసలు రూపం బయటపెట్టి.. పెళ్లికి నో చెప్పాడు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఊరి వేసుకొని చనిపోయింది. ఆమె రాసుకున్న సూసైడ్ లెటర్ ఆమె దుస్తుల్లో లభించింది. అతగాడు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాల్ని తాను సేకరించానని.. తనకు బతకాలనిపించలేదన్న ఆమె.. తన ఫోన్ ను చెక్ చేసుకోవాలని పేర్కొంది. సహజీవనం చేస్తున్న వ్యక్తి సందేహాలు.. అతగాడి నయవంచనకు ఒక మహిళ బలైన ఉదంతంగా దీన్ని చెప్పాలి.