Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు రానున్న విదేశీ రాయబారులు, హై కమీషనర్లు

By:  Tupaki Desk   |   8 Dec 2020 5:06 PM GMT
హైదరాబాద్ కు రానున్న విదేశీ రాయబారులు, హై కమీషనర్లు
X
హైదరాబాద్ కు బుధవారం వివిధ దేశాలకు చెందిన అత్యంత ప్రముఖులు రాబోతున్నారు. ఒకేసారి ఇంతమంది హైదరాబాద్ కు వస్తున్నారు ? ఎందుకంటే యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా తయారు చేస్తున్న ఫార్మా కంపెనీల్లో హైదరాబాద్ కంపెనీ కూడా ఉండటమే. భాగ్యనగరంలోని భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ కోవిడ్ టీకాను డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే.

కంపెనీ తయారు చేస్తున్న టీకాను ఈమధ్యనే ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని మరికొన్ని దేశాలు కూడా కోవిడ్ టీకాను డెవలప్ చేస్తున్నప్పటికీ మనదేశంలోని మూడు కంపెనీల పరిశోధనలు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇందులో పూనాలోని సీరమ్ కంపెనీ తయారు చేస్తున్న కోవాక్సిన్ ఒకటి, హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ రెండోది. భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ను స్వయంగా ప్రధానమంత్రే వచ్చి పరిశీలించిన విషయం తెలిసిందే.

ఇపుడు ఇదే విషయమై 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమీషనర్లు హైదరాబాద్ కు రాబోతున్నారు. వీరంతా కోవిడ్ వ్యాక్సిన్ తయారీని స్వయంగా పరిశీలిస్తారని అంటున్నారు. అయితే ఆయా దేశాల తరపున వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో భారత్ బయోటెక్ కంపెనీతో ఒప్పందాలు చేసుకోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఎన్నిదేశాలు వచ్చినా వ్యాక్సిన్ వినియోగంలోకి వచ్చినపుడు మొదటి ప్రయారిటీ మనదేశానికే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కరోనా వైరస్ టీకా పుణ్యమా అని ఇపుడు హైదరాబాద్ ప్రపంచపఠంలో ప్రముఖంగా వెలిగిపోతోంది.