Begin typing your search above and press return to search.
స్టీల్ ప్లాంట్ కొనేందుకు విదేశీ కంపెనీలు క్యూ
By: Tupaki Desk | 11 Dec 2022 5:30 PM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే స్టీల్ కి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనేందుకు విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని తాజాగా వార్తలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయాల్సిందే అని కేంద్ర గట్టి పట్టుదలతో ఉంది. అంతే కాదు ఇది వ్యూహాత్మకమైన అమ్మకంగా చెప్పుకుంటోంది.
దీనికి సంబంధించి దీపం కార్యదర్శి తుహీన్ కాంత్ పాండే తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరణ చేయడం ఖాయమని చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. అంతే కాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగేందుకు లీగల్ కన్సల్టెంట్స్ నియామకం కోసం ఆహ్వానం పంపారు. అదే విధంగా సలహాదారుల నియామకానికి కూడా దీపం తరఫున టెండర్లను పిలిచారు.
దానికి పెద్ద ఎత్తున బిడ్స్ దాఖలు అయ్యాయని తాజాగా తెలుస్తోంది. అదే విధంగా చూస్తే మరో వైపు స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే ప్రైవేటీకరణ చర్యలను మొదలెట్టేశారు. వివిధ విభాగాలకు అది పాకుతోంది. దాని అమలు ఏ విధంగా ఉంది అన్నది ఎప్పటికపుడు కేంద్రం స్టీల్ ప్లాంట్ యాజమాన్యనంతో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని వివరాలను సేకరిస్తోంది.
అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఇక దేశంలో కూడా అనేక ప్రాధాన్యత కలిగిన కంపెనీలు కూడా స్టీల్ ప్లాంట్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయవద్దంటూ దాదాపుగా రెండేళ్ళుగా ఉక్కు కార్మిక లోకం, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
వీలైతే సెయిల్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయాలని మరో ప్రతిపాదనను వినిపిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ అమ్మకాన్న్ని స్టాటజీగా అభివర్ణిస్తోంది. ఇప్పటికి అనేక సార్లు కేంద్ర ఉక్కు మంత్రులు ఇదే విషయం పార్లమెంట్ లోపలా బయటా స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకం ద్వారా కేంద్రం వ్యాపారం చేయడానికి లేదు అని చెప్పాలనుకుంటున్నారు.
దీంతో కార్మికుల వేదనలు రోదనలు మాత్రం ఎవరికీ వినిపించడంలేదు. విశాఖ ఉక్కు ప్రవైటీకరణ విషయంలో జోరుగా కేంద్రం తన కార్యక్రమాలను చేసుకుంటూ పోతోంది. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కుగా ఇక మీదటా ఉండబోదు అనే అంటున్నారు. దీని వెనక ఉన్న త్యాగాలు కానీ అమరవీరుల బలిదానాలు కానీ కేంద్రం ఈ స్థితిలో పట్టించుకునే సీన్ లేదని అంటున్నారు. ఈ పరిణామాలతో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏ తీరున ముందు ముందు సాగుతుందో చూడాలి.కేంద్రం మాత్రం ప్రైవేట్ చేస్తామనే అంటోంది. బహుశా కొత్త ఏడాది స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణము ముహూర్తంగా ఎంచుకోవచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఏపీకి ఉన్న అందమైన బంధం పూర్తిగా తెగిపోయినట్లే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.