Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ యుద్ధంలో విదేశీ ఫైటర్లా ?
By: Tupaki Desk | 13 March 2022 1:30 AM GMTరష్యా-ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరుగుతోందా ? అవుననే సమాచారం వినిపిస్తోంది. ఆ కీలక మలుపు ఏమిటంటే రష్యా తరపున ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న సైనికుల్లో విదేశీ ఫైటర్లు కూడా వచ్చి చేరుతున్నారట. సిరియా, మధ్యప్రాచ్యం కు చెందిన ఐసిస్ మాజీ ఫైటర్ల సుమారు 16 వేల మందిని రష్యా ఉక్రెయిన్ కు పంపబోతోందట. వేలాదిమంది ఫైటర్లను ఉక్రెయిన్ కు పంపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలని సిరియా, మధ్యప్రాచ్యంలోని ఐసిస్ మాజీ ఫైటర్లు తమను కోరినట్లు షొయిగు తెలిపారు.
రష్యా తరపున ఉక్రెయిన్ పై యుద్ధం చేయటానికి విదేశీ ఫైటర్లను పంపటంలో తప్పేమీ లేదని షొయిగు సమర్ధించుకున్నారు. ఉక్రెయిన్ సైన్యంతో కలిసి తమపై పోరాడేందుకు కిరాయి సైన్యాన్ని పంపేందుకు అమెరికా సమర్ధించుకున్న విషయాన్ని షొయిగు గుర్తు చేస్తున్నారు.
కిరాయి సైన్యంపై అమెరికా ఆలోచననే తాము కూడా అనుసరిస్తున్నట్లు రష్యా ఉన్నతాధికారులు చెప్పారు. మొత్తానికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 17 రోజులైంది. ఇప్పటికీ పరిమత సైన్యాన్నే ఉక్రెయిన్ మీదకు పుతిన్ పంపుతున్నారు. నిజంగానే పూర్తిస్ధాయి సైన్యాన్ని, ఆయుధాలను పంపుంటే ఈపాటికి ఉక్రెయిన్ పనైపోయుండేదే. అయితే ఎందుకని పరిమిత సైన్యాన్ని మాత్రమే పుతిన్ పంపారో అర్ధం కావటం లేదు.
పుతిన్ నిర్ణయం వల్ల రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సొస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ కు నాటో దేశాలు నిధులతో పాటు భారీగా ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి.
పనిలోపనిగా ఉక్రెయిన్ సైన్యానికి మామూలు జనాలు కూడా మద్దతుగా నిలబడ్డారు. దాంతో రష్యా సైన్యాలు చాలా నెమ్మదిగా ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తున్నారు. మరి కారియి సైన్యం రంగప్రవేశంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.