Begin typing your search above and press return to search.
మందుబాబులకు తీపి కబురు ...ఆన్ లైన్ లో ఫారెన్ లిక్కర్ !
By: Tupaki Desk | 24 Feb 2020 5:10 AM GMTప్రపంచం రోజురోజుకి ఆన్ లైన్ కి బాగా అడిక్ట్ అయిపోతుంది. ప్రస్తుతం ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ లో బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వచ్చేస్తుంది. వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు అంతా ఆన్ లైన్ లోనే ఆర్డర్లు ఇస్తూ ఇంటికి తెప్పించుకుంటున్నారు. సమయాన్ని వృధా చేయకుండా ..ఈ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఆన్లైన్ జీవితానికి బాగా అలవాటుపడ్డారు. దేశంలో ఈ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ది చెందడంతో ఈ సేవలన్ని అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం వ్యాపారాన్ని కూడా ఆన్ లైన్ చేసేందుకు లిక్కర్ ఇండస్ట్రీ కసరత్తు చేస్తోంది. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త లిక్కర్ పాలసీ తెచ్చిన ప్రభుత్వం ఆన్ లైన్ లో ఫారెన్ లిక్కర్ అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది మందుబాబులకు అతి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటివరకు మందు కోసం క్యూ లో నిలబడినవారందరు కూడా ఇకపై మందు కొనాలంటే ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయవచ్చు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆన్ లైన్ అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు జరిపితే మద్యం అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా పెరుగుదలను నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు అమలులోకి వస్తే నచ్చిన ఫారెన్ బ్రాండ్ ను ఆర్డర్ చేసుకొని మందు బాబులు మద్యం తాగవచ్చు. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి . ప్రస్తుతానికి ఫారెన్ లిక్కర్ అమ్మకాలను మాత్రమే ఆన్ లైన్ లో అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే , మరికొందరు మాత్రం మద్యం ఆన్ లైన్ అయితే ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.