Begin typing your search above and press return to search.
భారత పౌరులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేయండి..: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
By: Tupaki Desk | 6 March 2022 2:51 AM GMTరష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో ఇప్పటికే భారత వైఖరి స్పష్టం చేసింది. తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. అంటే ఉక్రెయిన్ కంటే రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నిరూపితమైంది.
విద్యార్థుల విషయంలో మోడీ ఫోన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించడంపై చర్చనీయాంశంగా మారింది. భారత విద్యార్థుల కోసం మోడీ చెప్పగానే ఆరుగంటల పాటు యుద్ధం ఆపడంపై ప్రపంచదేశాలు భారత ప్రధాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఆపే శక్తి మోడీకి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆ దిశగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య 11 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను రష్యా ఆక్రమించే యత్నం చేస్తోంది. అయితే ఉక్రెయిన్ సైనిక బలగాలతో పాటు సాధారణ పౌరులు సైతం కదనరంగంలోకి దిగి రష్యా బలగాలను ఎదుర్కొంటున్నారు.
కానీ ఇప్పటికే ఉక్రెయిన్లోని ఖేర్సన్, మెలిటోపాల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. ఇక రాజధాని కీవ్ పై నిరంతర దాడులు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ సాధారణ పౌరులు సైతం రష్యా సైనికులతో పోరాడడంతో ఈ నగరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోవడం కష్టతరమవుతోంది.
కానీ కీవ్ తో పాటు చెర్నిహిన్, మరియోపాల్ నగరాలను సైతం చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఈ నగరాలు రష్యా ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉన్నాయి. అలాగే ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్ పై రష్యా వైమానిక దాడులు కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా తాజాగా ఓ వీడియో సందేశాన్ని ప్రపంచానికి అందించారు. తమ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని కోరారు. తాము రష్యాతో ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుందో చెప్పి.. ఆయా దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేయాలని కోరారు.
ఈ తరుణంలో ఆయన భారత్, చైనా, నైజిరియా వంటి దేశాల పేర్లను ప్రస్తావించారు. ఇక భారత్ గురించి దిమిత్రో పలు విషయాలు వెల్లడించారు. భారత్ తో తమకు సత్సంబంధాలున్నాయని అన్నారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంటుందని అన్నారు.
అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే ఉత్పత్తులు దిగుమతుల విషయంలో కష్టమవుతుందని అన్నారు. ఇలా ఆహార సంక్షోభం ఏర్పడితే ఉక్రెయిన్ కే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు.
భారత్ కు చెందిన ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని అన్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా భారత్ తో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాలు తమ వద్ద చదువుకుంటున్నారని, వారికి అన్ని విధాల సహకారాలు అందించామన్నారు. వారి కోసం రైళ్లు, హాట్ లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నిత్యం ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అందువల్ల భారత్లోని సాధారణ పౌరులు సైతం రష్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని కోరారు.
ఇక దౌత్య దేశాలన్ని భారత్ తో మాట్లాడాలని దిమిత్రో కులేబా అన్నారు. యుద్ధం ఆపేందుకు మిగతా దేశాలన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి రష్యాను ఒప్పించేలా చేయాలన్నారు. తాము కూడా మోదీతో తరుచూ సంప్రదిస్తున్నామని తెలిపారు. హ్యూమనైటేరియన్ కారిడార్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి రష్యా సానుభూతి పొందాలని రష్యా చూస్తోందని, కానీ అది సాధ్యం కాదని దిమిత్రో కులేబా చెప్పారు.