Begin typing your search above and press return to search.

టూరిస్టులు బికినీల్లో తిర‌గొద్దు..కేంద్ర మంత్రి ఆదేశం

By:  Tupaki Desk   |   16 March 2018 11:30 PM GMT
టూరిస్టులు బికినీల్లో తిర‌గొద్దు..కేంద్ర మంత్రి ఆదేశం
X
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే అల్ఫోన్స్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో ఆదేశాలు జారీచేశారు. ఇంకా చెప్పాలంటే..భారత్‌ కు వచ్చే టూరిస్టుల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ కు వచ్చే విదేశీయులు తమ దేశంలోని బీఫ్‌ ను తిని రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి భారత్‌ కు వచ్చే టూరిస్టులు భారత సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలన్నారు. బికినీలు ద‌రించ‌వ‌ద్ద‌ని హుకుం జారీచేశారు.

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. `విదేశాల్లో బికినీలు వేసుకుని వీధుల్లో తిరుగుతారు. అలా అని భారత్‌కు వచ్చినప్పుడు కూడా అలాగే చేయకూడదు. లాటిన్‌ అమెరికాలోని కొన్ని నగరాల్లో అక్కడి మహిళలు బికినీలు ధరించే రోడ్లపై నడుస్తారు. అక్కడ దానికి అనుమతి ఉంది కాబట్టి ఎలాంటి సమస్యా లేదు. మన దేశంలోనూ గోవా బీచుల్లో బికినీలు వేసుకుని విదేశీయులు కన్పించడం సాధారణమే కానీ.. అవే దుస్తుల్లో నగర వీధుల్లో తిరుగుతామంటే మాత్రం కుదరదు` అని అన్నారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించాలని, అలా అని భారత్‌కు వచ్చినప్పుడు చీర కట్టుకోవాలని చెప్పడంలేదని కేంద్ర మంత్రి అన్నారు. అయితే మంచి దుస్తులు వేసుకుంటే సరిపోతుందని అల్ఫోన్స్‌ తెలిపారు.