Begin typing your search above and press return to search.

ఫిఫా ఎఫెక్ట్.. అరబ్ కు పోటెత్తిన విదేశీయులు..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 11:30 PM GMT
ఫిఫా ఎఫెక్ట్.. అరబ్ కు పోటెత్తిన విదేశీయులు..!
X
ప్రపంచ కప్ ఫుట్ బాల్-2022 పోటీలు నవంబర్ 20 నుంచి ఖతార్ వేదికగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా జరుగుతున్న పుట్ బ్యాచ్ లీగ్ మ్యాచ్ లన్నీ ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు చెందిన ఫుల్ బాల్ అభిమానులంతా ఖతార్ చేరుకుంటున్నారు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఐదు ఎయిర్ పోర్టులన్నీ కూడా ప్రతిరోజు కిక్కిరిసిపోతున్నాయి.

ఫుట్ బాల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వేలాదిగా అభిమానులు యూఏఈకి తరలి వస్తుండటం.. హాలీడేస్ ఎంజాయ్ చేసేందుకు వస్తున్న పర్యాటకులతో విమానాశ్రయాల్లో భారీ రద్దీ నెలకొంది. అబుదాబీలోని ఐదు విమానాశ్రయాల్లో ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తుండంతో ఆయా ఎయిర్ లైన్ సంస్థలు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో యూఏఈ విమానాశ్రయాల నుంచి రాకపోకలు విస్కృతంగా కొనసాగాయి. అబుదాబీలోని ఐదు ఎయిర్ పోర్టుల ద్వారా గత తొమ్మిది నెలల కాలంలో ఒకటిన్నర మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణీకులు రాకపోకలు సాగించారని అంచనా. ఇందులో అత్యధికంగా భారతీయులే ఉండటం విశేషం.

గత తొమ్మిది నెలల కాలంలో యూఏఈకి 9 లక్షల 33 వేల 640 మంది భారతీయులు ప్రయాణం సాగించారు. ఇండియా తర్వాతి స్థానంలో బ్రిటన్ నుంచి 2 లక్షల 91 వేల 576 మంది.. పాకిస్తాన్ నుంచి 2 లక్షల 65 వేల 793 మంది.. సౌదీ అరేబియా నుంచి 2 లక్షల 17వేల 656 మంది.. ఈజిప్టు నుంచి ఒక లక్షా 97వేల 193 మంది ప్రయాణించినట్లు విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలోనే జూలై నుంచి సెప్టెంబర్ వరకు ముంబై.. ఢిల్లీ.. కొచ్చి ఎయిర్ పోర్టులు సైతం ప్రయాణికులతో రద్దీగా మారాయి. గత రెండేళ్లు కరోనా ఆంక్షలతో విదేశీయులు ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. దీంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టాల్లో కురుకపోయింది. దీంతో అనేక మంది విమానయాన సిబ్బంది రోడ్డున పడాల్సి వచ్చింది.

అయితే ఇటీవలే యూఈఏలో కరోనా ఆంక్షలు ఎత్తి వేయడం.. ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుండటంతో లక్షలాది మంది విదేశీయులు ఖతర్ కు పయనమవుతున్నారు.గత రెండేళ్లుగా విహారయాత్రలకు దూరంగా ఉన్న విదేశీయులంతా మునుపటిలా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన రంగం తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.