Begin typing your search above and press return to search.
రాజస్థాన్ పుష్కర్ మేళాలో విదేశీయులు సందడి..!
By: Tupaki Desk | 8 Nov 2022 6:30 AM GMTరాజస్థాన్లో ప్రతీ యేటా పుష్కర్ మేళాను ఘనంగా నిర్వహిస్తారు. అలంకరించబడిన ఒంటెలను ఇసుకలో ఆడించడం ఈ జాతరలో ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ జాతరను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక ఈ జాతరలో జరిగే పోటీల్లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేస్తుంటారు.
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో పుష్కర్ జాతరను ప్రభుత్వం నిర్వహిస్తోంది. నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆటల పోటీలు.. హస్తకళల ప్రదర్శన.. ఒంటెల ప్రదర్శన.. రుచికరమైన ఆహార పదార్థాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు రాజస్థాన్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
నవంబర్ 1న పుష్కర్ మేళాను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. అనంతరం పుష్కర్ సరస్సు వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి మహా ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘పుష్కర్ చలో అభియాన్ ’ కింద రాజస్థాన్ టూరిజం శాఖ లక్షకు పైగా విదేశీయులను ఆహ్వానించించడం విశేషం. తొలి రోజు నుంచే పుష్కర్ సరోవర్ ఘాట్లో విదేశీయుల సందడి మొదలైంది.
నవంబర్ 1న చక్ దే రాజస్థాన్ పుట్ బాల్ మ్యాచ్ స్థానిక మరియు విదేశీయుల మధ్య జరిగింది. అదేరోజు సాయంత్రం దీపన్.. రంగోలీ.. మహా హారతి.. పుష్కర అభిషేకం.. క్యాండిల్ బెలూన్ వంటి కార్యక్రమాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గత వారం రోజులుగా పుష్కర్ మేళా ఘనంగా జరుగుతోంది.
నేటి ఉదయం 8 గంటలకు వాటర్ వర్క్స్ పంప్ హౌస్ వద్ద ఇసుక కళ పోటీలను నిర్వహించారు. ఫోటోగ్రఫీ పోటీలు.. మహా హారతి కార్యక్రమం.. మట్కా రేసు కార్యక్రమం.. మ్యూజికల్ చైర్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన యువతులు పాల్గొన్నారు.
మట్కా రేసులో భాగంగా నీరు ఉన్న కుండను తలపై పెట్టుకొని ఇసుకలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ పోటీలో భారతీయ మహిళలను విదేశీయులను ఓడించడం గమనార్హం. ఈ పోటీలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన తనయిలా నిలిచారు. అనంతరం జరిగిన మ్యూజికల్ చైర్ పోటీల్లో అజ్మీర నివాసి సుశీలా చౌదరి గెలుపొందింది. ఇక రేపటితో పుష్కర్ మేళా కార్యక్రమం ముగియనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.