Begin typing your search above and press return to search.
దిశ కేసులో విస్తుపోయే నిజాలు బయటపెట్టిన ఫోరెన్సిక్ నివేదిక .. ఏంటంటే !
By: Tupaki Desk | 28 Jan 2020 7:39 AM GMT‘దిశ’ అనే వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు పాశవికంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచారం, హత్య కేసులో పోలీసుల విచారణ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల దిశను అత్యాచారం చేసిన నిందితులు మహ్మద్ షాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించింది. 2019 డిసెంబర్ 2వ వారంలో షాద్ నగర్ పోలీసులు దిశ కేసుకు సంబంధించిన 40 సాక్ష్యాధారాలను పరీక్షల కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
వాటిని ల్యాబ్‌లో చాలా సునిశితంగా పరిశీలించి, విశ్లేషించిన అనంతరం.. నిపుణులు నివేదిక తయారు చేశారు. దిశ, ఆమె సోదరి ఫోన్ సంభాషణలోని స్వరాలు, టోల్ ప్లాజా వద్ద దిశను లాక్కెళ్లేటప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ, బాధితురాలి సెల్ ఫోన్ లోని నెంబర్లు, ఎస్ ఎం ఎస్ లు తదితర కీలక ఆధారాలను విశ్లేషించారు. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు రోజుల్లో పోలీసులకు అందజేయనున్నట్టు తెలిసింది.
దిశ అత్యాచారానికి సంబంధించిన అత్యంత కీలకమైన దృశ్యాలు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దిశ నిందితులతో మాట్లాడటం, దిశను లారీ దగ్గరకు లాక్కెళ్లడం, ఇలా దిశ ఘటన కు సంబంధించిన కీలక దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు టెక్నాలజీని వినియోగించి మరింత స్పష్టం గా నిందితుల ముఖాలు కనిపించేలా చేశారు. దిశ ఆమె సోదరితో మాట్లాడిన కాల్ రికార్డులను పరిశీలించగా ఆ స్వరాలు వారివేనని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. దిశ అంతకుముందు ఎక్కువగా ఎవరి తో మాట్లాడిందో ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించారు.