Begin typing your search above and press return to search.
విశాఖలో బయటపడ్డ భారీ భూ కుంభకోణం .. ఎన్ని ఎకరాలంటే ?
By: Tupaki Desk | 7 Nov 2019 9:07 AM GMTవిశాఖ జిల్లాలో అటవీ భూముల పై భూ బకాసురులు కన్నుపడింది. దీనితో నకిలీ దస్తావేజులు సృష్టించి, దానికి అనుగుణం గా ప్రభుత్వ రికార్డులనూ కూడా ట్యాంపర్ చేశారు. ఈ విశాఖ జిల్లాలో దాదాపు 868.49 ఎకరాల అటవీ భూములకు సంబంధించిన రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు సంబంధిత అధికార యంత్రాంగం గుర్తించి కూడా చాలాకాలం అయ్యింది.
ఇదే అంశం పై న్యాయ స్థానాల్లో అధికార యంత్రాంగం పోరాడుతుంది. తాజాగా ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు బుధవారం సాయంత్రం విశాఖ ఢీ ఎఫ్ వో సెల్వం ఫిర్యాదు చేశారు. అక్రమంగా రికార్డ్స్ మార్చి , ఆక్రమించుకున్న భూముల విలువ సుమారు రూ.5000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అటవీ భూముల రికార్డులు ట్యాంపర్ అయినా కూడా ప్రస్తుతం ఈ భూములు మాత్రం అటవీ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి.
ట్యాంపర్ అయిన భూములలో .. ఏ సర్వే నెంబరులో ఎంత భూమికి సంబంధించి రికార్డులు ట్యాంపర్ అయ్యాయనే విషయాన్ని కూడా ఆయన సవివరంగా తన ఫిర్యాదులో తెలిపారు. ఈ భూముల్లో కొన్నింటి పై ఫారెస్టు సెటిల్‌మెంట్ కోర్టులో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పులు రాగా ప్రత్యర్థులు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. ఇంకా జిల్లా, హై కోర్టులో 14 కేసులు ఉన్నాయి. తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి, రికార్డుల ట్యాంపరింగ్ తదితర అంశాలను ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు తెలిపారు.