Begin typing your search above and press return to search.

జేసీ సోదరులకు మరో ఉచ్చు

By:  Tupaki Desk   |   7 Feb 2020 8:39 AM GMT
జేసీ సోదరులకు మరో ఉచ్చు
X
అనంతపురం జిల్లాలో ఉన్న కీలక నాయకులు జేసీ సోదరులు దివాకర్ రెడ్డి - ప్రభాకర్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. దీంతో వాళ్లు కోలుకోలేకుండా పోతున్నారు. ఇప్పటికే త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు చేయగా భారీ ఎదురుదెబ్బ పడింది. దాన్నుంచి కోలుకోని పరిస్థితిలోనే వారిపై మరో కేసు నమోదైంది. జేసీ సోదరులకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా సిమెంట్ - ట్రావెల్స్ వ్యాపారం ఉన్నాయి. ఇవే వారికి లాభాలు తెచ్చిపెట్టాయి. గతంలో ప్రభుత్వం తమదే ఉండడంతో భారీగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. అప్పుడు అప్పనంగా లబ్ధి పొందిన వాటిని కక్కించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా త్రిసూల్ లీజు రద్దు చేసింది. ఇప్పుడు వీరిద్దరూ మరో కేసులో చిక్కుకున్నారు.

వీరికి చెందిన జేసీ ట్రావెల్స్ కార్యాలయంలో ఒక వ్యవహారం బయటపడింది. జేసీ ట్రావెల్స్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తుండగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. తనిఖీల సమయంలోనే ఇవి బయటపడడం విశేషం. వీరు లారీల విక్రయం కోసం ఏకంగా తాడిపత్రి ఎస్ ఐ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకంతో నకిలీ పత్రాలు రూపొందించి కర్నాటకలోని బెంగళూరులో 6 లారీలను విక్రయించారు. అయితే ఫోర్జరీ చేసిన నిందితులు రామ్మూర్తి - ఇనామ్ పరారీలో ఉన్నారు. గతంలో సీఐని దూషించిన కేసులో - ప్రభుత్వ హయాంలో చేసిన దౌర్జన్యాలపై వీరిపై కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారడంతో వారి గడ్డుకాలం వచ్చింది.