Begin typing your search above and press return to search.

సెక్ర‌టేరియ‌ట్ లో డ్రెస్ కోడ్ పెట్టేసిన ప‌ళ‌ని స‌ర్కార్!

By:  Tupaki Desk   |   2 Jun 2019 4:52 AM GMT
సెక్ర‌టేరియ‌ట్ లో డ్రెస్ కోడ్ పెట్టేసిన ప‌ళ‌ని స‌ర్కార్!
X
ఉన్న‌త స్థానంలో ఉన్న‌ప్పుడు.. అందుకు త‌గ్గ‌ట్లే హుందాగా వ‌స్త్ర‌ధార‌ణ ఉంటే బాగుంటుంద‌ని చెబుతూ తమిళ‌నాడు స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.ఇక‌పై రాష్ట్ర ఉద్యోగులంతా సంప్ర‌దాయ వ‌స్త్రాల్ని ధ‌రించాల‌ని పేర్కొంటూ తాజాగా డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చారు. ఇక‌పై సెక్ర‌టేరియ్ లో ప‌ని చేసే పురుష ఉద్యోగులు ఫార్మ‌ల్ చొక్కాలు.. ఫార్మ‌ల్ ఫ్యాంట్లు మాత్ర‌మే వేసుకోవాల‌ని.. మ‌హిళా ఉద్యోగులు చీర లేదంటే దుప‌ట్టాతో ఉన్న చుడీదార్.. స‌ల్వార్ క‌మీజ్ లు ధ‌రించాల‌న్న ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆస‌క్తిక‌ర జీవోను చీఫ్ సెక్ర‌ట‌రీ గిరిజా వైద్య‌నాథ్ తాజాగా విడుద‌ల చేశారు. ఇటీవ‌ల స‌చివాల‌యంలో ప‌ని చేసే ఉద్యోగులు ప‌లువురు యువ ఉద్యోగులు జీన్స్.. టీ ష‌ర్ట్ ల‌లో విధుల‌కు హాజ‌రు కావ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఆఫీసు మ‌ర్యాద‌ను కాపాడేందుకు డ్రెస్ కోడ్ అంద‌రూ అనుస‌రించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇక‌పై.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కోర్టులు.. ట్రైబ్యున‌ల్ లేదా న్యాయ క‌మిటీల ముందు హాజ‌ర‌య్యే ఉద్యోగులంతా త‌ప్ప‌నిస‌రిగా ట్రైజ‌ర్లు.. కోట్ ధ‌రించాల‌ని.. మ‌హిళా ఉద్యోగులైతే చీర లేదంటే దుప‌ట్టాతో ఉన్న చుడిదార్ వేసుకోవాల‌ని తేల్చారు. త‌మిళ సంప్ర‌దాయాన్ని ప‌రిర‌క్షించేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విధానాన్ని త‌ప్ప‌క ఫాలో కావాల‌ని కోరారు. రానున్న రోజుల్లో త‌మిళ‌నాడును స్ఫూర్తిగా తీసుకొని మ‌రిన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇదే త‌ర‌హా నిర్ణ‌యాన్ని తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.