Begin typing your search above and press return to search.

పేకాట నేను కూడా ఆడ‌తా: ఏపీ మాజీ మంత్రి హాట్ కామెంట్స్ వైర‌ల్

By:  Tupaki Desk   |   30 July 2022 5:58 AM GMT
పేకాట నేను కూడా ఆడ‌తా: ఏపీ మాజీ మంత్రి హాట్ కామెంట్స్ వైర‌ల్
X
దేశంలో వివిధ ప్రాంతాల‌తోపాటు నేపాల్, థాయ్‌లాండ్, శ్రీలంక అడ్డాలుగా చికోటి ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డిలు నిర్వ‌హించిన‌ క్యాసినో వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 మంది ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు మంత్రులు, మాజీ మంత్రులు సైతం విదేశాల‌కు వెళ్లి క్యాసినోలు ఆడివ‌చ్చార‌ని అంటున్నారు. అయితే క్యాసినో అనేది ముసుగు మాత్ర‌మేన‌ని.. పెద్ద ఎత్తున న‌ల్ల‌ధ‌నాన్ని త‌ర‌లించి దాన్ని వైట్ గా మ‌ళ్లీ దేశంలోకి తెచ్చుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. అధికార పార్టీ, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఆరోప‌ణ‌లు, తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. కాగా మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై ఒకింత ఘాటుగా స్పందించారు.

అబద్దాలు ఆడాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని.. పేకాట తాను కూడా ఆడ‌తాన‌ని.. అయితే క్యాసినోకు కూడా వెళ్తాన‌ని తేల్చిచెప్పారు. చికోటి ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డిల‌తో మాత్రం త‌న‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అన‌వ‌స‌రంగా త‌న పేరును టీవీ చానెళ్ల‌లో ప్ర‌సారం చేయ‌డం, క‌థ‌నాలు వేయ‌డం చేయొద్ద‌ని కోరారు.

త‌న‌కు చికోటి ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డిల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని క‌థ‌నాలు ప్ర‌సారం చేయొద్ద‌ని మాజీ మంత్రి బాలినేని మీడియా ప్ర‌తినిధుల‌కు ఒకింత ఘాటు హెచ్చ‌రికలు జారీ చేశార‌ని అంటున్నారు.

త‌న‌పై బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మం చేయొద్ద‌ని మీడియా ప్ర‌తినిధుల‌ను కోరారు. కావాలంటే త‌న‌పై అన్ని టీవీ చానెళ్లు ఎంక్వ‌యిరీ చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌వీణ్ తో త‌న‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌న్నారు. తాను ఉన్న విష‌యం చెబుతాన‌ని.. పేకాట ఆడారా అంటే ఆడేన‌ని చెబుతున్నా. అంతేకానీ డ్రామాలు చేసి న‌టించ‌డం త‌న‌కు చేత కాద‌ని బాలినేని ఘాటుగా స్పందించారు

కాగా ప్ర‌స్తుతం బాలినేని.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీసీ కోఆర్డినేట‌ర్ గా ఉన్నారు. జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో విద్యుత్, అట‌వీ శాఖ‌, ఇంధ‌నం, శాస్త్ర‌, సాంకేతిక శాఖ‌లు ద‌క్కించుకున్నారు. అయితే జ‌గ‌న్ త‌న రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బాలినేని త‌న మంత్రి ప‌ద‌విని కోల్పోయారు.