Begin typing your search above and press return to search.
తిరుపతి తోలి మేయర్ గా మాజీ అటెండర్ కోడలు..!
By: Tupaki Desk | 18 March 2021 10:30 AM GMTతిరుపతి నగర మేయర్ గా ఒకప్పటి తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అటెండర్ కోడలు డా.శిరీష ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ గా ముద్ర నారాయణ ప్రమాణస్వీకారం చేశారు. కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 11గంటలకు తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిపారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన ఎన్నికల పరిశీలకులు నవీన్ కుమార్ సమక్షంలో తిరుపతి శాసనసభ్యులు, కార్పొరేషన్ ఎక్స్ అఫిషియోసభ్యులు భూమన కరుణాకర రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైసీపీకి చెందిన 48 మంది కార్పొరేటర్లు, టీడీపీకి చెందిన ఒక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్పొరేటర్లలో 27మంది మహిళలు, 22మంది పురుషులు ఉన్నారు. మొదట కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఆ తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. వైసీపీ తరఫున 48మంది కార్పొరేటర్లు ఉండడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వారికే దక్కాయి. 27వ డివిజన్ కార్పొరేటర్ డా.శిరీష పేరును మేయర్ గా 1వ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ప్రతిపాదించగా 16 వ డివిజన్ కార్పొరేటర్ మోహన్ కృష్ణ యాదవ్ బలపరిచారు. దీంతో శిరీష మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నాలుగో డివిజన్ కార్పొరేటర్ భూమన అభినయరెడ్డి పేరును డిప్యూటీ మేయర్గా.. 14వ డివిజన్ కార్పొరేటర్ ముద్ర నారాయణ ప్రతిపాదించగా 38వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రనాథ్ బలపరిచారు.
కాగా తిరుపతి తొలి మేయర్ గా ఎన్నికైన డా. శిరీష మామ అయిన మునెయ్య తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఒకప్పుడు అటెండర్. 30 ఏళ్ల సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్ గా ఆరేళ్ళ క్రితం రిటైర్ అయ్యారు. ఆయన కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కు తొలి మేయర్ గా ఎన్నికయ్యారు. అటెండర్ గా తాను పనిచేసిన సంస్థకు తన కోడలే మేయర్ గా అవ్వడంపట్ల ఆయనతో పాటు కుటుంబసభ్యలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునయ్య కు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆసుపత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్ద కుమారుడు. ఆయన భార్యే డాక్టర్ శిరీష. కడప జిల్లా కొర్రపాడు కు చెందిన శిరీష 1980 లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి 2011 లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు.