Begin typing your search above and press return to search.

మిత్రుడి చిరకాల కోరిక తీర్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

By:  Tupaki Desk   |   14 March 2022 2:30 PM GMT
మిత్రుడి చిరకాల కోరిక తీర్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
X
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.ఆటగాడిగా మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా అనేక సంవత్సరాలుగా కోల్ కతాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వంతో కూడా చాలా ముందున్నానంటూ నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి తన స్నేహితుడి కోరిక తీర్చాడు. వ్యక్తిగతంగా ఎలాంటి బంధం, సంబంధం లేకపోయినా తన దేశానికి చెందిన ఒక స్నేహితుడైన అనాథ ఆఖరి కోరికను నెరవేర్చారు.

ఇటీవలే మరణించిన సిడ్నీకి చెందిన 58 ఏళ్ల బూట్లు పాలిష్ చేసే వ్యక్తి బ్రియాన్ రుడ్ అస్థికలను అతడి కోరిక ప్రకారం.. స్టీవ్ వా స్వయంగా గంగానదిలో నిమజ్జనం చేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ భారత్ లోనే ఉన్న స్టీవ్ అస్థికల నిమజ్జనం కోసం వారణాసికి వెళ్లడం విశేషం. సహచర ఆస్ట్రేలియన్ కోసం తాను చేసిన పని చాలా సంతృప్తినిచ్చినట్లు స్టీవ్ వా వ్యాఖ్యానించారు.

బ్రియాన్ అస్థికలు ఇక్కడి నీటిలో కలపడం గౌరవంగా భావిస్తున్నా.. అతడి జీవితం చాలా కఠినంగా గడిచింది. అతడికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. గంగానదిలో తన అస్థికలు నిమజ్జనం చేయాలనేది అతడి చివరి కోరిక.. దానిని నెరవేర్చడం సంతృప్తిగా ఉంది అని స్టీవ్ వా వ్యాఖ్యానించారు.

రోడ్డు పక్కన బూట్ పాలిష్ చేసుకునే వ్యక్తి అంటే సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ బ్రియాన్ రుడ్ చనిపోయిన రోజు ఆస్ట్రేటియా మీడియా మొత్తం దానిని ప్రముఖ వార్తగా ప్రచురించింది. సిడ్నీలో అతను ఉదయం , సాయంత్రం రెండు చోట్లలో బూట్ పాలిష్ చేస్తుంటాడు.

మూడు నెలలకే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు 7 ఏళ్ల వరకూ అనాథ ఆశ్రమంలో పెరిగాడు. చివరకు ఒక ఫాదర్ చేరడంతో బూట్ పాలిస్ నే వృత్తిగా మార్చుకున్నాడు.తన మాటలు, పాటలతో సిడ్నీ నగరవాసులందరికీ అతడంటే అభిమానం. తను చనిపోతూ ఫాదర్ అస్తికలు గంగలో కలపాలని చెప్పాడట..

ఆ విషయం తెలుసుకున్న స్టీవ్ వా తన కంపెనీ సీఈని పంపి మరీ ఆ అస్థికలు తీసుకొచ్చి తాజాగా గంగలో కలిపాడు. మొత్తంగా ఒక అనాథ చివరి కోరికను నెరవేర్చి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు.