Begin typing your search above and press return to search.
ఐపీఎల్ కోసం వచ్చి గుండెపోటుతో క్రికెట్ దిగ్గజం మృతి
By: Tupaki Desk | 24 Sep 2020 5:33 PM GMTప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. మ్యాచ్ లు మొదలై టీంలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో క్రికెట్ జోష్ నెలకొంది. అయితే ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చిన ప్రఖ్యాత కామెంటేటర్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు.
యూఏఈలో జరుగుతున్న మెగా టీ 20 క్రికెట్ లీగ్ లో స్టార్ స్పోర్ట్స్ తరుపున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఇక్కడి నుంచే లైవ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుుదిశ్వాస విడిచారు.
మెల్ బోర్న్ లో పుట్టి పెరిగిన డీన్ జోన్స్ ఆస్టేలియా తరుపున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 216 సాధించగా 11శతకాలు నమోదు చేశారు. ఇక వన్డేలో మ్యాచ్ లు ఆడిన ఆయన 6,068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు, 46 అర్ధశతకాలు ఉన్నాయి.