Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌ధాని కొడుక్కి యావ‌జ్జీవం!

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:17 AM GMT
మాజీ ప్ర‌ధాని కొడుక్కి యావ‌జ్జీవం!
X
బంగ్లాదేశ్ కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ఆ దేశ ప్ర‌ధాని కుమారుడికి జీవిత ఖైదు విధించ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఒక గ్ర‌నేడ్ పేలుళ్ల కేసులో దేశ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి కొడుకు బాధ్య‌త ఉంద‌న్న వైనం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అత‌గాడిపై చేసిన ఆరోప‌ణ‌లు నిరూపితం కావ‌ట‌మే కాదు.. అత‌గాడికి ఏకంగా యావ‌జ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు పేర్కొంది.

ఇంత‌కీ.. ఆ మాజీ ప్ర‌ధాని ఎవ‌ర‌రంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని ఖ‌లీదా జియా కుమారుడు త‌రీఖ్ రెహ్మాన్‌. ప‌ద్నాలుగేళ్ల క్రితం దేశ రాజ‌ధాని ఢాకాలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ ర్యాలీని నిర్వ‌హిస్తుండ‌గా.. గ్ర‌నేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మ‌ర‌ణించ‌గా.. 500 మందికిపైనే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడిలో బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని జిల్లూర్ రెహ్మాన్ భార్య ఇవీ రెహ్మాన్ కూడా మ‌ర‌ణించారు.

ఈ ప్ర‌మాదాన్ని తృటిలో త‌ప్పించుకున్న వారిలో ప్ర‌స్తుత ప్ర‌ధాని షేక్ హ‌సీనా కూడా ఉన్నారు. ఈ గ్ర‌నేడ్ దాడిపై విచార‌ణ జ‌రిపిన అధికారుల బృందం మాజీ ప్ర‌ధాని ఖ‌లీదా జియా కొడుకు ఉన్న‌ట్లుగా తేల్చారు. దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచార‌ణ చివ‌ర‌కు త‌రీఖ్ రెహ్మాన్ కు శిక్ష‌ను క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణ‌యం వెలువ‌డే స‌మ‌యానికి అంద‌రి ప్ర‌ముఖుల మాదిరే.. త‌రీఖ్ జంప్ అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌గాడు బ్రిట‌న్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అత‌డికి సంబంధించిన ఏ అంశాలు బ‌య‌ట‌కు రాకుండా బ్రిట‌న్ ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.