Begin typing your search above and press return to search.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే టార్గెట్.. దాడిచేసిన మావోయిస్టులు.. ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 5 Jan 2022 7:30 AM GMTజార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి బతుకుజీవుడా అంటూ తృటిలో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. మంగళవారం జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో ఫుట్ బాల్ పోటీలకు గురుచరణ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి దిగారు.
దీంతో అప్రమత్తమైన ఆయన బాడీ గార్డులు మాజీ ఎమ్మెల్యేను రక్షించారు. ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతిచెందగా.. మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన బాడీగార్డ్ ను తాజాగా హతమార్చినట్టు సమాచారం.
ముగ్గురు బాడీగార్డుల నుంచి ఒక ఏకే 47, రెండు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కెళ్లారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. డీజీపీ కూడా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఫుట్ బాల్ క్రీడల ప్రారంభోత్సవానికి వెళుతున్నట్టు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
గురుచరణ్ గతంలో మనోహర్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించారు. బాడీ గార్డు మృతదేహాలను కనుగొనే పనిలో పోలీసులు పడ్డారు.