Begin typing your search above and press return to search.
డబ్బులు పంచే అభ్యర్థుల పదవి ఊడగొట్టాలిః సీబీఐ మాజీ జేడీ
By: Tupaki Desk | 3 April 2021 1:30 PM GMTఇవాళ దేశంలో రాజకీయాలు ఎంత అవినీతిమయం అయ్యాయో అందరికీ తెలిసిందే. దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది డబ్బులు పంచే ఎన్నికల్లో గెలుస్తారనే అభిప్రాయం జనాల్లో ఉంది. తాజాగా.. ఇదే అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడారు.
దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తంశారు. 2019 ఎన్నికల సమయంలో దేశంలో రూ.3,451 కోట్లు పట్టుబడ్డాయని, కానీ.. ఆ డబ్బు ఏమైందో తెలియలేదని వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని గతంలో సుప్రీం కోర్టు అడిగితే.. పట్టుకున్న డబ్బంతా లెక్కలు చూసి, వారికే ఇచ్చేశామని పోలీసులు చెప్పారని లక్ష్మీనారాయణ అన్నట్టు సమాచారం.
పోలీసులు ఎన్నికల సమయంలో నేతల డబ్బుకు కస్టడీగా ఉంటున్నారని సుప్రీం వ్యాఖ్యానించినట్టు గుర్తుచేశారట. ఎన్నికల వేళ పోలీసులు, కంట్రోల్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నప్పటికీ.. పట్టుబడిన డబ్బుకు లెక్కలు ఉండట్లేదని మాజీ జేడీ అన్నట్టు సమాచారం.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించాల్సిన అవసరం ఉందని, లేదంటే.. ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇది జరగాలంటే.. ఎన్నికల్లో పట్టుబడిన డబ్బులపై సమగ్ర విచారణ జరిపి, సదరు అభ్యర్థి గెలిచి ఉంటే.. వారిని డిస్క్వాలిఫై చేయాలని లక్ష్మీనారాయణ సూచించినట్టు సమాచారం. అప్పుడే ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని సూచించినట్టు తెలుస్తోంది.