Begin typing your search above and press return to search.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్!
By: Tupaki Desk | 14 July 2022 2:48 PM GMTనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూలై 14న అరెస్ట్ చేసింది. ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. దీంతో కోర్టు ఆమెను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది.
చిత్రా రామకృష్ణ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ అధిపతి రవి నారాయణ్‌లపై ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసును నమోదు చేసింది. కాగా ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ, ఈడీ దృష్టిలో ఓ సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్ పాండే చట్టవ్యతిరేకంగా కొందరిపై నిఘా పెట్టినట్లు సాక్ష్యాధారాలు లభించాయని సమాచారం.
కాగా కొందరు స్టాక్ బ్రోకర్లకు చిత్రా రామకృష్ణ, ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ అనుకూలంగా వ్యవహరించారనే దానిపైన ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మే 21న సీబీఐ దేశవ్యాప్తంగా దాడులకు దిగింది. 2013లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన చిత్రా.. ఏడాదికి రూ.4.21 కోట్ల భారీ వేతనానికి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించారు. అంతేకాకుండా ఈమెయిల్ రూపంలో ఆయనతో అనేక రహస్యాలను పంచుకున్నారు. వీరిద్దరి వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన వివరాలు ఈమెయిల్ సంభాషణల్లో వెలుగుచూశాయి.
పైగా తాను ఈమెయిల్‌లో చాట్ చేసింది.. ఒక హిమాలయ ఆధ్యాత్మిక గురువుతో అంటూ చిత్ర సీబీఐ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఆ హిమాలయ ఆధ్యాత్మిక గురువును తానెప్పుడూ కలవలేదని.. ఆయన ఎలా ఉంటారో కూడా తనకు తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కు సంబంధించిన అనేక నిర్ణయాలను ఆయనతో చర్చించే తీసుకున్నానని తెలిపారు. యోగి సలహా మేరకే తాను ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించుకున్నానని.. ఇలా అధికారుల విచారణలో వారికి చుక్కలు చూపించారు.
అయితే మొయిల్ ఐడీ వివరాలతో చిత్రా రామచంద్రన్ మెయిల్‌లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది ఆనంద్ సుబ్రమణియన్ తోనేనని వెల్లడైంది. ఆయనతో చిత్రకు సమ్‌థింగ్ స్పెషల్ సంబంధం కూడా ఉందని బయటపడింది. అలాగే స్టాక్ బ్రోకర్లకు మేలు చేయడానికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టమ్‌ను సైతం చిత్రా మార్పించారని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఆమెను ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకోవడంతో చిత్రా రామకృష్ణ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేసు విచారణలో చిత్రా రామకృష్ణ సహాయ నిరాకరణ చేస్తున్నారని.. ఆమెను 9 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. అయితే కోర్టు నాలుగు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతినిచ్చింది.