Begin typing your search above and press return to search.

తమిళనాట తెలుగోళ్ల కోసం కొత్త పార్టీ.. ఏకమవుతారా?

By:  Tupaki Desk   |   15 Feb 2020 5:43 AM GMT
తమిళనాట తెలుగోళ్ల కోసం కొత్త పార్టీ.. ఏకమవుతారా?
X
ప్రాంతీయ ఉద్యమాలు దేశానికి కొత్త కాదు.. భాష ప్రతిపదికనే నాడు ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయింది. ఒక భాష వారి కోసం, ప్రాంతీయ అభిమానం కోసం విడిపోయిన సందర్భాలున్నాయి. ఏపీలో వివక్షకు గురయ్యామని తెలంగాణ వాసులు ప్రాంతీయ పోరాటం చేసి గెలిచారు. ఇక నాడు చెన్నై కోసం పోరాడిన ఆంధ్రులకు అది దక్కలేదు. కానీ మెజార్టీ తెలుగు వాళ్లు ఎంతో మంది ఇప్పటికీ అక్కడున్నారు.

తమిళనాడులో వివక్షకు గురవుతున్న తెలుగు వారి కోసం ఇప్పుడు ఒక కొత్త తెలుగు రాజకీయ పార్టీ పుట్టుకొస్తోంది. తమిళనాడులోని తెలుగు ప్రజలను ఏకంగా చేయడానికి ఓ తెలుగు వ్యక్తి ఈ పార్టీ స్థాపించబోతున్నాడు.

తమిళనాడు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి , తెలుగు వ్యక్తి అయిన రామ్మోహన్ రావు తాజాగా తమిళనాట ఓ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ తెలుగు పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు రామ్మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు.

రామ్మోహన్ రావు మాజీ సీఎం జయలలితకు సన్నిహితులుగా పేరుంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సర్కారు ఆయనపై ఐటీ దాడులు చేయించింది. ఇప్పుడు ఈ ప్రతీకార రాజకీయాలతోనే ఆయన పార్టీకి పురుడు పోసినట్టు సమాచారం.

తమిళులకు భాషాభిమానం ఎక్కువ. ఇతర ప్రాంతీయులను సహించరు. అలాగే తమిళనాడుపై దాడికి వస్తే ఊరుకోరు. అక్కడ వివక్షకు గురవుతున్న తెలుగు వారిని ఏకం చేయడానికి రామ్మోహన్ పూనుకున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో మద్రాస్ లో పెద్ద సంఖ్యలో తెలుగువారు ఉన్నారు. వీరంతా రామ్మోహన్ రావు సైడ్ తిరిగితే తమిళనాట పార్టీలకు డేంజర్ బెల్స్. ఓటు బ్యాంకు చాలా చీలుతుంది. మరి తమిళనాట ఈ కొత్త ఏమేరకు ప్రభావం చూపుతుందనేది వేచిచూడాల్సిందే..