Begin typing your search above and press return to search.

కోహ్లీ సెలెక‌్షన్‌ పై మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 April 2020 2:30 AM GMT
కోహ్లీ సెలెక‌్షన్‌ పై మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు
X
భారత క్రికెట్‌ లో గురుశిష్యులుగా గుర్తింపు పొందిన వారు మహేంద్ర సింగ్‌ ధోని - విరాట్‌ కోహ్లీ. వీరిద్దరూ భారత జట్టును క్రికెట్‌ లో అగ్రభాగాన నిలిపారు. అయితే వీరిద్దరి మధ్య మొదట పడేది కాదని.. వాస్తవంగా కోహ్లీని భారత జట్టు తరఫున ఆడించడం ధోనికి అస్సలు ఇష్టం లేదని మాజీ సెలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే భారత జట్టు తరఫున విరాట్‌ కోహ్లీ ఆడడం ధోనీకి ఇష్టం లేదనే విషయాన్ని మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ ప్రతినిధి తో పంచుకున్నారు.

'2008లో శ్రీలంక ప‌ర్యటన‌కు భారత జట్టును ఎంపిక చేస్తున్నాం. అప్పట్లో అండర్ -23 ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలనుకున్నాం. అయితే అప్పటికే కెప్టెన్‌ గా విరాట్ కోహ్లీ అండ‌ర్‌-19 వ‌న్డే ప్రపంచ క‌ప్‌ను గెలిచాడు. అండర్ -23లో కూడా బాగా ఆడుతుండడం తో అతడిని భారత జట్టులోకి ఎంపిక చేయడానికి సెలక‌్షన్‌ కమిటీ భావించింది. కోహ్లీకి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావించి సెలక్ట్‌ కమిటీ అంతా ఒకే అనగా ధోనీ మాత్రం వ్యతిరేకించారంట.

శ్రీలంక ప‌ర్యట‌న‌ కోసం భారత జట్టులోకి విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తున్నామని అప్పటి కోచ్ గ్యారీ కిర్‌ స్టెన్ - కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు చెప్పగా.. కోహ్లీ బ్యాటింగ్ చూడ‌లేద‌ని - అత‌డికి చాన్స్ అవసరం లేదని ధోనీ స్పష్టం చేశారంట. ప్రస్తుతం కొనసాగుతున్న జట్టు తో వెళ్తామని ధోనీ పేర్కొన్నట్లు వెంగ సర్కార్‌ ప్రకటించారు. అయితే ధోన్నీ అన్న మాటలకు వెంగసర్కార్‌ బదులిస్తూ 'మీరు అతడి (కోహ్లీ) ఆటను చూడలేదు కానీ.. నేను చూశా.. కోహ్లీని జట్టులోకి తీసుకుంటున్నాం అని వారితో చెప్పా' అని చెప్పారు.

అయితే ధోనీ మాదిరిగానే అప్పటి బీసీసీఐ చీఫ్ శ్రీనివాస‌న్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని కూడా విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేసిన‌ట్లు వెల్లడించారు. దేశ‌వాళీ టోర్నీల్లో ప‌రుగులు చేస్తున్న త‌మిళ‌నాడు ఆటగాడు సుబ్రమ‌ణ్యం బ‌ద్రీనాథ్‌ ను భారత జట్టులోకి ఎంపిక చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. బ‌ద్రీనాథ్‌ ను ఎంపిక చేయాలని శ్రీనివాస‌న్‌ కు ధోనీ కూడా మద్దతుగా ఉన్నాడని పేర్కొన్నారు. కోహ్లీని భారత జట్టులోకి తీసుకోవడంపై అప్పట్లో ఎవరూ సంతోషంగా లేరని దిలీప్‌ వెంగ్‌ స‌ర్కార్‌ వివరించారు.