Begin typing your search above and press return to search.

బీఫ్ తింటాడట.. పైగా హిందువట.. మాజీ సీఎంకు నోటిదురుసు

By:  Tupaki Desk   |   24 May 2022 12:30 PM GMT
బీఫ్ తింటాడట.. పైగా హిందువట.. మాజీ సీఎంకు నోటిదురుసు
X
అసలే దేశమంతా దేశభక్తి, జాతీయవాదం.. హిందుత్వంతో అట్టుడుకుతోంది. బీజేపీ వచ్చాక సామాజిక, అభివృద్ధి అంశాలన్నీ పక్కకుపోయి హిందుత్వమే ఎజెండా మారింది. ఇలాంటి టైంలో నోటిదురుసుతో మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు మాజీ సీఎం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందుత్వ వాదులకు మరింతగా ఆగ్రహం తెప్పిస్తున్నాడు.

కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువును అని.. ఇప్పటివరకూ గోమాంసం తినలేదని.. కావలంటే తాను బీఫ్ తింటానని చెప్పి వివాదానికి ఆజ్యం పోశాడు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభకు హాజరైన సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని ఆరోపించారు. ఓ వర్గమే గొడ్డు మాంసం తినడం లేదని.. హిందువులు, క్రైస్తవులు కూడా దీనిని తింటున్నారని అన్నారు.

'నేను హిందువుని.. ఇప్పటివరకూ గొడ్డుమాంసం తినలేదు. కానీ కావలనుకుంటే నేను తింటాను. నా ఆహారపు అలవాట్లు నా ఇష్టం. అది నా హక్కు. నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు? గొడ్డు మాంసం తినేవాళ్లు కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు.. హిందువులు, క్రైస్తవులు కూడా తింటారు. ఒకసారి నేను కర్ణాటక అసెంబ్లీలో కూడా చెప్పాను' అని సిద్ధరామయ్య రెచ్చిపోయారు.

బీఫ్ తినకూడదని నాకు చెప్పడానికి మీరు ఎవరు అంటూ సిద్ధరామయ్య ఎదురు ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ తోటి మనుషుల్లో విభేదాలు సృష్టించి మతాల మధ్య అడ్డుగోడలను నిర్మిస్తున్నారని సిద్ధూ ఆరోపించారు.

గత ఏడాది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో గోమాంసం నిషేధాన్ని అమలు చేస్తోంది.ఈ చట్టం ప్రకారం ఆవులు, ఎద్దులు, దున్నపోతలను వధించడం.. వాటి మాంసం అమ్మడం.. రవాణా నిషేధం. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50లక్షల జరిమానా విధిస్తారు.