Begin typing your search above and press return to search.
పత్తేగడ పంచాయతీపై మాజీ సీఎం కిరణ్ కుమార్ ముద్ర.. మరి ఇప్పుడు?!
By: Tupaki Desk | 6 Feb 2021 5:30 PM GMTమాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరు. ఇక్కడి కలికిరి మండలంలోని పత్తేగడ పంచా యతీపై నల్లారి కుటుంబం తమదైన ముద్ర వేసింది. నాలుగు తరాలుగా ఇక్కడి పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవడంతోపాటు.. ఈ పంచాయతీని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత నల్లారి కుటుంబానికే చెందుతుంది. నల్లారి సుబ్బారెడ్డితో మొదలైన ఈ పంచాయతీ ప్రస్థానం.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివరకు అప్రతిహతంగా ముందుకు సాగింది. అనేకసార్లు ఏకగ్రీవాలు జరగడం తోపాటు.. అభివృద్ధి పథంలోనూ దూసుకుపోయింది. పంచాయతీ ఆవిర్భావం నుంచి 2003 వరకు కూడా నల్లారి కుటుంబమే ఏకగ్రీవం అవుతూ.. వచ్చింది.
ఇక, ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ.. నల్లారి కుటుంబం బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ఇక, పత్తేవా డ పంచాయతీని పరిశీలిస్తే.. ఈ పంచాయతీ పరిధిలో 23 గ్రామాలు ఉన్నాయి. జనాభా 4 వేలపైగానే ఉంది. వీరిలో 3347 మంది ఓటర్లు ఉన్నారు. ఇక, వీరిలో పురుషులు 1653, మహిళా ఓటర్లు 1694 మంది ఉన్నారు. తొలిసారి ఇక్కడ పంచాయతీ సర్పంచ్ గా నల్లారి సుబ్బారెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఆయ న తర్వాత ఆయన కుమారులు నల్లారి అమర్నాథరెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, హరినాథరెడ్డి, శ్రీధర్‌రెడ్డి(మనవడు) సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, 2003 నుంచి పత్తేగడ పంచాయతీలో అనేక మార్పులు వచ్చాయి.
2003లో సర్పంచ్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. 2008లో ఎస్సీమహిళకు కేటాయించారు. ఇక, 2013లో బీసీలకు కేటాయించారు. ఆయా సందర్భాల్లో నల్లారి కుటుంబం బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. అభివృద్ది పరంగా చూసుకుంటే.. నల్లారి ఫ్యామిలీ పత్తేగడ పంచాయతీపై తమదైన ముద్ర వేసింది. వ్యవసాయ విద్యుత్ లో ఓల్టేజీ సమస్యను తగ్గించేందుకు సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కిరణ్ కుమార్‌రెడ్డి సీఎం అయిన తర్వాత.. ఇక్కడ బీఎస్ ఎఫ్, ఐటీబీటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. పంచాయతీలోని 23 గ్రామాల్లో సీసీరోడ్లు, తాగునీటి పథకంఇలా అనేక మౌలిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేయించారు. మొత్తంగా చూస్తే.. పత్తేగడ పంచాయతీపై నల్లారి ముద్ర పటిష్టమే చెప్పాలి.
ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్తులు పోటా పోటీగా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లోనూ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేయడం గమనార్హం. అయితే.. ఈ దఫా నల్లారి కుటుంబం ప్రభావం పెద్దగా కనిపించడం లేదని తెలుస్తోంది.