Begin typing your search above and press return to search.
ఫుట్‌పాత్ పై మాజీ సీఎం మరదలు .. దయనీయ స్థితిలో ఆ మాజీ అథ్లెట్ !
By: Tupaki Desk | 10 Sep 2021 11:36 AM GMTసాధారణంగా ఓ ముఖ్యమంత్రి కుటుంబం , ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినా కూడా దాదాపుగా రెండు , మూడు తరాలు ఆ పేరుతో, అలాగే వారు సంపాదించిన ఆస్తి తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి స్వయానా మరదలు రోడ్డు వెంబడి అత్యంత దయనీయ స్థితిలో కనిపించింది. పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు అత్యంత దైన్య స్థితిలో ఫుట్ పాత్ పై కనిపించడం అందరినీ షాక్ కు గురిచేసింది. నెరిసిన జుట్టు, నైట్ గౌన్ తో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాబజార్ ప్రాంతంలో తిరుగుతూ, ఫుట్ పాత్ పై నిద్రిస్తూ, వీధి వ్యాపారులు పెట్టే ఆహారం తింటూ గడుపుతున్న ఆమె మాజీ ముఖ్యమంత్రి మరదలని తెలిసి అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్ పాత్ పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్ డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి. క్రికెట్ లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్ పాత్ పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు.
ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్ లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్ కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్ లోని ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి చందా స్పందించారు. ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్ కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు అని పేర్కొన్నారు.
అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది.బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఇరా బసు మాట్లాడుతూ.. ఉపాధ్యాయినిగా తన కెరియర్ ను ప్రారంభించిన సమయంలో బుద్ధదేవ్ తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని చెప్పారు.
తన శక్తియుక్తులనే ఉపయోగించానని చెప్పుకొచ్చారు. తమ కుటుంబాల మధ్య బంధుత్వం అందరికీ తెలిసిందే అయినా తాను వీఐపీ ఐడెంటిటీని కోరుకోలేదని అన్నారు. ఇరా బసు ఫుట్ పాత్ పై నివసిస్తున్నారన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత అధికారులు వెంటనే స్పందించారు. అంబులెన్స్ లో ఆమెను కోల్‌కతా ఆసుపత్రికి తరలించారు. వయసు, ఇతర సమస్యలున్నప్పటికీ విద్యావిధానంపై ఆమెకు ఇప్పటికీ మంచి పట్టు ఉండడం గమనార్హం. ఆన్ లైన్ చదువులకు తాను మద్దతు పలకబోనని ఇరా బసు స్పష్టం చేశారు.