Begin typing your search above and press return to search.
సీఎం మార్పు.. మా కుటుంబాన్ని లాగొద్దు
By: Tupaki Desk | 16 Jun 2021 2:30 AM GMTకర్ణాటకలో సీఎం యడ్యూరప్పను మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ యోచిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్పు విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని లాగినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మాజీ సీఎం హెచ్.డీ కుమారస్వామి స్పందించారు.
బీజేపీ సీఎం మార్పులో తమ కుటుంబాన్ని లాగవద్దని.. తాము ఎవరికి మద్దతు కాదని తనయుడు హెచ్.డి కుమార స్వామి అన్నారు. మాండ్య తాలుకా హనకెరెలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాజాగా పేదలకు ఆహార కిట్లను కుమారస్వామి అందజేశారు. జేడీఎస్, దేవెగౌడ పేర్లను రెండు జాతీయ పార్టీలు అనేక ఏళ్లుగా దుర్వినియోగం చేస్తున్నాయని మాజీ సీఎం ఆరోపించారు.
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు 75 ఏళ్లు దాటడం.. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దేవెగౌడ కుటుంబాన్ని ఇందులో ఇన్ వాల్వ్ చేయడంపై కుమారస్వామి తప్పుపట్టారు..
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది. యడ్యూరప్ప పదవి వీడాలని పట్టుబడుతున్న నేతలను శాంతింపచేజేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అరుణ్ సింగ్ ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకొని సర్దిచెప్పారు.
ఈ విషయంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్ సింగ్ కర్ణాటకలో సీఎం మార్పును కొట్టిపారేశారు. యడ్యూరప్ప ఉత్తమంగా పాలిస్తున్నారని.. కోవిడ్ ను చక్కగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. సీఎం మార్పు అవసరం లేదన్నారు.బెంగళూరు వెళ్లి తాను సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
ఇక నాయకత్వ మార్పుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. మార్పు ఉండబోదని అరుణ్ సింగ్ గట్టిగా చెబుతున్నప్పటికీ వచ్చేవారం తాను బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను శాంతింప చేస్తానని చెప్పడంతో మార్పు తథ్యమనే సంకేతాలకు బలం చేకూరినట్టైంది. మరోవైపు ఇందులో పలువురిని ఇన్ వాల్వ్ చేయడంపై ఆ పార్టీలు తప్పుపడుతున్నాయి.