Begin typing your search above and press return to search.
ఆ మాజీ సీఎంకు రెండోసారి జైలుశిక్ష.. తాజాగా ఎన్ని సంవత్సరాలంటే?
By: Tupaki Desk | 28 May 2022 4:48 AM GMTరాజకీయంగా తిరుగులేని రీతిలో వ్యవహరించి.. కొంతకాలం పాటు హర్యానా రాజకీయాల్లో చక్రం తిప్పిన 86 ఏళ్ల ఓం ప్రకాశ్ చౌతాలాకు రెండోసారి జైలు తప్పలేదు. ఆయన మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది.
అధికారికంగా వెల్లడించిన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. విచారణలో అక్రమాస్తుల లెక్క బయటకు రావటం.. అందుకు తగ్గ ఆధారాలు ఉండటంతో ఆయనకు నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. అంతేకాదు.. నాలుగేళ్ల జైలుతో పాటు రూ.50 లక్షల జరిమానా విధించింది.
ఒకవేళ ఈ రూ.50 లక్షల మొత్తాన్ని చెల్లించకుంటే మరో ఆర్నెల్లు జైలు తప్పదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆయనకు చెందిన నాలుగు ఆస్తుల్ని జఫ్తు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1993-2006 మధ్యలో ఆయన రూ.6.09 కోట్ల మొత్తాన్ని అక్రమంగా సంపాదించారంటూ సీబీఐ కేసు పెట్టింది. అధికారికంగా వెల్లడించిన ఆదాయానికి మించి 189.11 శాతం మేర అధికంగా ఆస్తులు ఉన్నట్లుగా సీబీఐ గుర్తించింది.
గతంలో చౌతాలాకు ఉపాధ్యాయుల భర్తీ స్కాంలోనూ జైలుశిక్షను అనుభవించారు. తాజాగా మాత్రం అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను సీబీఐ కోర్టును విధించిన నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన్ను తీహార్ జైలుకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్ని నిర్వహించిన అనంతరం రెండో నెంబరు జైలులో ఉంచనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఖైదీలతో ఆయన్ను ఉంచనున్నారు.
గతంలోనూ ఇదే జైల్లో ఆయన ఉన్నారు. ఆ కేసులో శిక్ష పూర్తి చేసుకొని గత ఏడాది జులైలో జైలు నుంచి విడుదలైన ఆయన.. పదినెలల వ్యవధిలోనే మళ్లీ అదే జైలుకు వెళ్లాల్సి రావటం గమనార్హం. అంతేకాదు.
ఈ కేసులో సీబీఐకు రూ.5లక్షల మొత్తాన్ని చెల్లించాలన్న ఆదేశాల్ని కోర్టు ఆదేశించటం అసాధారణ చర్యగా అభివర్ణిస్తున్నారు. ఏమైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక నేత.. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా జైలుపాలుకావటం.. అది కూడా పెద్ద వయసులో కావటం చూస్తే.. చేసిన తప్పునకు ఏ రోజుకైనా శిక్ష తప్పదన్న భావన కలుగక మానదు.