Begin typing your search above and press return to search.
మోడీ హవాలో మాజీ సీఎంలు మట్టికరిచారు!
By: Tupaki Desk | 25 May 2019 4:55 AM GMTతాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. 2014లో మోడీ వేవ్ కంటే బలమైన గాలి తాజా ఎన్నికల్లో వీసిందన్న విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చినా.. దాని తీవ్రత ఎంతన్న విషయంపై స్పష్టత వస్తున్న కొద్దీ విస్మయం వ్యక్తమవుతోంది.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజకీయ అధినేతలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తిరుగులేని నేతలుగా ఒక వెలుగు వెలిగి.. ఇప్పటికి బలమైన నేతలుగా పేరున్న పలువురు ప్రముఖులు మట్టి కరిచిన వైనం తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ గాలి పుణ్యామా అని తాజాగా వెలువడిన ఫలితాలను విశ్లేషిస్తే.. ఒక మాజీ ప్రధాని.. డజను మంది మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడిన దీనస్థితి నెలకొంది.
రాజకీయాల్లో అపార అనుభవంతో పాటు.. హేమాహేమీ నేతలుగా పేరున్న వారు.. లోక్ సభ ఎన్నికల్లో కనీసం విజయం సాధించలేని దుస్థితి ఇప్పుడు వారు జీర్ణించుకోలేని పరిస్థితినెలకొంది. ఎన్నికల్లో ఓడిన 12 మంది మాజీ ముఖ్యమంత్రుల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ ప్రముఖులే కావటం విశేషంగా చెప్పాలి. మరో కీలకమైన అంశం ఏమంటే.. ఒక ఎన్నికల్లో అత్యధిక మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోయిన ఎన్నికలు కూడా ఇవేనని చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రాన్ని ఏలిన మాజీ సీఎం షీలాదీక్షిత్ తాజా ఎన్నికల్లో ఎంపీగా కూడా ఎన్నిక కాకపోవటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక.. షీలాదీక్షిత్ లాంటి వారికి తాజా ఫలితం శరాఘాతంగా మారింది. ఆమె ఢిల్లీ ఈశాన్య నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో 3.16 లక్షల ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోవటం ఆమెకో పీడకలగా మారుతుందనటంతో సందేహం లేదు.
మాజీ ప్రధానిగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన దేవగౌడ్ తన రాజకీయ జీవితంలో అత్యంత ఇబ్బందికర పరిస్థితిన ఎదుర్కొంటున్నారని చెప్పాలి. తన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆయన కనీసం ఎంపీగా కూడా గెలవలేకపోయారు. తుముకూరు నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో 13వేల తేడాతో ఓడిపోయారు. ఒక్కళిగలు..లింగాయత్ లు మధ్య సమరంగా మారే తుముకూరు నుంచి దైవెగౌడ పోటీ చేయటంపై పలు వాదనలు ఉన్నాయి. సాధారణంగా మాండ్య.. హాసన్ నుంచి పోటీ చేసే గౌడ కుటుంబం ఈసారి తన రాజకీయ వారసుల కోసం ఆరెండు సీట్లు ఇచ్చేసి.. పెద్దాయన్ను తుముకూరు బరిలో నిలిపింది. ఒక్క హాసన్ లో తప్పించి గౌడ కుటుంబానికి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
ఎన్నికల్లో ఓడిన మాజీ ముఖ్యమంత్రులు చూస్తే..
+ దేవెగౌడ
+ షీలా దీక్షిత్
+ ద్విగ్విజయ్ సింగ్
+ అశోక్ చవాన్
+ సుశీల్ కుమార్ షిండే
+ హరీశ్ రావత్
+ ముకుల్ సంగ్మా
+ వీరప్ప మొయిలీ
+ భూపేందర్ హుడా
+ మొహబూబా ముఫ్తీ
+ బాబులాల్ మరాండి
+ శిబు సోరెన్