Begin typing your search above and press return to search.
కనిగిరి నగరపంచాయతీ .. కమిషనర్ రూమ్ తాళం తీసేదెవరు ?
By: Tupaki Desk | 12 Nov 2021 8:30 AM GMTప్రకాశం జిల్లాలోని కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగర పంచాయతీ కమిషనర్ గా డీటీవీ కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో విధుల్లో చేరేందుకు కార్యాలయానికి కృష్ణారావు వచ్చారు. అయితే ఆఫీస్‌కి తాళాలు వేసి కృష్ణారావును నగర పంచాయతీ సిబ్బంది బయటే నిలబెట్టారు. గతంలో కూడా కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు మూడుసార్లు కృష్ణారావు వచ్చారు. గత కమిషనర్ రిలీవ్ కాకపోవటంతో తన విధుల్లో చేరకుండానే డీటీవీ వెనుదిరిగారు.
నగర పంచాయతీకి కొత్త కమిషనర్‌గా భీమవరం నుంచి బదిలీ అయ్యి వచ్చారు కృష్ణారావు. కానీ అక్కడే తిష్ట వేసిన పాత కమిషనర్ నారాయణరావు మాత్రం రిలీవ్ అవ్వడం లేదు.
ఎంతకీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఉన్నతాధికారుల జోక్యంతో కాస్త తగ్గి అక్కడి నుంచి బదిలీ అయిన విజయవాడ వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నాడుగానీ, కనిగిరి కమిషనర్ ఆఫీస్‌రూమ్‌కి మాత్రం తాళం వేసుకెళ్లాడు. నారాయణరావు వెళ్లిపోయారు కదాని కృష్ణారావు ఇప్పటికి మూడుసార్లు వచ్చి వెళ్లినా రూమ్ కి ఉన్న తాళం మాత్రం తీసేవాళ్లు లేరు.
పక్క రూమ్‌లో మిగతా సిబ్బంది పనిచేసుకుంటున్నా ఆయనకు మాత్రం ఓ కుర్చీ, బల్ల కూడా లేదు. విచిత్రం ఏంటంటే సిబ్బంది అంతా బదిలీ అయ్యి వెళ్లిపోయిన పాత కమిషనర్‌కే వత్తాసు పలుకుతున్నారు. వాళ్లకీ వాళ్లకీ ఏముందోగానీ.. కొత్తగా వచ్చిన కృష్ణారావు మాత్రం రోజూ రావడం, రూమ్ ముందు నిలబడటం, కాసేపు ఎదురుచూడటం వెళ్లిపోవడం, ఇదే విధిగా మారిపోయింది.