Begin typing your search above and press return to search.
పవన్ తో జగ్గారెడ్డి స్పెషల్ మీటింగ్
By: Tupaki Desk | 26 Jan 2017 4:21 AM GMTకాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) మరోమారు కలకలం సృష్టించారు. జనసేన పార్టీ అధినేత - సినీ హీరో పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని చారిత్రాత్మక కట్టడం - భక్తుల విశ్వాసాన్ని పెంపొందిస్తున్న భవానీ మందిరం వద్ద పవన్ కల్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి పవన్ ను కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కరచాలనం, ఆలింగనం చేసుకుని పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. కాసేపు మాటామంతి నిర్వహించుకున్నారు.
పవన్ కళ్యాణ్ ను కలిసిన సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పవన్ తో తనకున్న పూర్వ పరిచయాల వల్ల మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని జగ్గారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ-టీడీపీలు ధ్వంద వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని, సీమాంధ్రులు కోరుకుంటున్న ప్రత్యేక హోదాను కల్పిస్తుందని జగ్గారెడ్డి తెలిపారు. ప్రసిద్ధిగాంచిన భవాని మందిరంలో కొనసాగుతున్న కాటమరాయుడు సినిమా విజయం సాధించేలా అమ్మవారు తప్పనిసరిగా దీవెనలు అందిస్తుందన్నారు. కాగా సినిమా షూటింగ్, యువతను అధికంగా ఆకట్టుకునే పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అన్ని వర్గాల వారు పోటీ పడ్డారు. షూటింగ్ ప్రాంతానికి పెద్ద ఎత్తున మీడియా వెళ్లగా మాట్లాడేందుకు పవన్ నిరాకరించారు. కొంత మంది అభిమానులతో కలిసి పవన్ కల్యాణ్ సెల్ఫీలకు ఫోజిచ్చి సంతృప్తి పర్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/