Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్!
By: Tupaki Desk | 25 Jun 2022 5:30 AM GMTఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన ఏడాదిన్నర కిందటే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు. చేరికలకు సంబంధించి తన అనుచరులను కూడా రెడీగా ఉంచుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు ఎర్ర శేఖర్ వద్దకు వచ్చి ఆయనను బతిమలాడటంతో అప్పట్లో కాంగ్రెస్ లో చేరకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరగడంతో మరోసారి ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లోని చేరాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం.
కాగా జడ్చర్ల నియోజకవర్గంలో బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, జడ్చర్ల, మిడ్జిల్ మండలాలు ఉన్నాయి. 2,02,362 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం మంది ఓటర్లు బీసీలే. ఎర్రశేఖర్ కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే ఆ వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రశేఖర్ ఆ పార్టీలో చేరిన వెంటనే, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు జడ్చర్ల లో కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చే ఎన్నికల్లో తనకే దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మండలాల్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తున్నారు. ప్రత్యక్షంగా పాల్గొంటూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరితే, పరిస్థితి ఏంటనే దానిపై కేడర్ చర్చించుకుంటోంది. కాగా, ఎర్రశేఖర్ గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పని చేశారు.
అయితే, ఎర్రశేఖర్‌ను పాలమూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నారు. అలా కుదరకపోతే ఎర్ర శేఖర్ సొంత నియోజకవర్గమైన దేవరకద్ర నుంచి కూడా టికెట్ ఇచ్చే చాన్సు ఉందని అంటున్నారు. అయితే, జడ్చర్ల నుంచే అనిరుధ్‌రెడ్డి, ఎర్రశేఖర్ టికెట్ల కోసం పట్టుబడితే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.