Begin typing your search above and press return to search.

ధోని రిటైర్మెంట్ పై అజార్ కామెంట్

By:  Tupaki Desk   |   23 July 2019 7:48 AM GMT
ధోని రిటైర్మెంట్ పై అజార్ కామెంట్
X
ప్రపంచకప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటిదారి పట్టడం.. ఆ మ్యాచ్ తోపాటు అంతకుముందు మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాడు ధోని నెమ్మదిగా ఆడడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ధోని పని అయిపోయిందని రిటైర్ కావాలని కొందరు.. రిటైర్ మెంట్ విషయంలో ధోనిదే నిర్ణయమని బీసీసీఐ స్పష్టం చేసింది.

అయితే ధోని రిటైర్ మెంట్ పై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కామెంట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ హైదరాబాద్ లో అజార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ధోనిపై కామెంట్ చేశారు. ధోని టీమిండియా జట్టులో ఉండాలంటే ఖచ్చితంగా దూకుడుగా ఆడాలని.. అలా ఆడితేనే జట్టులో ఉండాలని కుండబద్దలు కొట్టారు.

ఇక భారత జట్టులోకి అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడాన్ని అజార్ తప్పుపట్టారు. ఈ విషయంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొందరు రాజకీయ నేతల వల్ల భ్రష్టు పట్టిందని.. త్వరలో జరిగే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నట్టు అజార్ ప్రకటించారు. అంతేకాదు.. బీసీసీఐ ప్రతినిధిగా హెచ్.సీఏ తరుఫున టీఆర్ ఎస్ మాజీ నేత జి.వివేకానందను సోమవారం నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజకీయ నేతల ఆదిపత్యం పోవడానికే తాను హెచ్.సీ.ఏ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అజార్ స్పష్టం చేశారు.