Begin typing your search above and press return to search.

కోహ్లీని చెడామడా తిట్టిన మాజీ క్రికెటర్​ .. ఇంతకీ ఏమైందంటే..!

By:  Tupaki Desk   |   24 March 2021 2:30 AM GMT
కోహ్లీని చెడామడా తిట్టిన మాజీ క్రికెటర్​ .. ఇంతకీ ఏమైందంటే..!
X
కోహ్లీపై మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కొంచెం పొగరు తగ్గించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. టీమిండియాకు కెప్టెన్​గా ఉన్నంత మాత్రాన అంత పొగరు పనికిరాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. టీమిండియా జట్టు కూర్పుపై తరచూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్​ అభిమానులతోపాటు, మాజీ క్రికెటర్లు సైతం సెలెక్టర్ల తీరును తప్పుపడుతుంటారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ విషయంపై కోహ్లీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ జట్టు కూర్పు విషయంలో బయటి వ్యక్తుల మాటలు అర్థరహితంగా ఉంటాయి. అన్ని అంశాలను పరిశీలించే తుది జట్టును ఎంపిక చేస్తాం. ఎటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు చాన్స్​ ఉండదు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడం ఆ దేవుడి వల్ల కూడా కాదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో కోహ్లీ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్​ మండిపడ్డారు.

‘కోహ్లీ కొంచెం అహంకారం తగ్గించుకుంటే మంచింది. కెప్టెన్ ఎలా ఉండాలో మహేంద్రసింగ్​ ధోనీని చూసి నేర్చుకోవాలి. ధోనిపై కూడా పలుమార్లు విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ధోనీ ఎంతో తెలివిగా సమాధానాలు చెప్పేవారు. కానీ కోహ్లీ మాత్రం రెచ్చిపోతున్నాడు. అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు’ అంటూ సంజయ్​ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో కోహ్లి మాట్లాడుతూ.. ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పు విషయంలో జరిగే చర్చ అంతా నాన్‌ సెన్స్ అని కొట్టిపారేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల సీరిస్‌లో తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం, వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమయిన నేపథ్యంలో కోహ్లి పైవిధంగా స్పందించాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో బయటకి వ్యక్తులు మాట్లాడకపోవడమే మంచింది అంటూ వ్యాఖ్యానించారు.