Begin typing your search above and press return to search.
మాజీ క్రికెటర్ వీబీ కన్నుమూత
By: Tupaki Desk | 16 Aug 2019 4:45 AM GMTఆయన జీవితం నేటితరం యువక్రికెటర్లకు స్ఫూర్తిదాయకం.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే క్రికెటే జీవితంగా ఉన్నారు. భారత్ తరుపున ఆడింది కేవలం ఏడు వన్డేలేగానీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం ఆయన రారాజు. భారత్ తరుపున ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్. ఇప్పటి తరానికి ఆయన ఎవరో తెలియకపోవచ్చుగానీ.. అప్పట్లో ఆయన దూకుడుకు మారు పేరు. ఆ దూకుడుతోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎప్పటికీ చెరిగిపోని ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా సుదీర్ఘకాలం పాటు క్రికెట్ కు సేవలు అందించిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) హఠాన్మరణం చెందడంతో క్రికెట్ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
తనదైన ఆటతీరుతో క్రికెట్ లో మంచి గుర్తింపు పొందిన మాజీ క్రికెటర్ వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. తమిళనాడు క్రికెట్ కు మూలస్తంభంలా నిలిచి సేవలు అందించారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1988–90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులే చేశారు. ఈ క్రమంలో స్థానం కోల్పోయి మళ్లీ జట్టులోకి ఆయన రాలేకపోయారు. కానీ.. వీబీ ఫస్ట్ క్లాస్ కెరీర్ మాత్రం అద్భుతంగా సాగింది. 11 ఏళ్లపాటు ఆయన కొనసాగారు. తమిళనాడు ఓపెనర్ గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు.
వీబీ 81 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించి విమర్శకులకు ఆటతోనే సమాధానం చెప్పారు. దూకుడైన ఆట ఆయన సొంతం. ఈ దశలో చంద్రశేఖర్ 1988–89 ఇరానీ కప్ మ్యాచ్ లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించి.. ఔరా అనిపించాడు. అప్పట్లో భారత్ తరఫున అదే ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ కావడం గమనార్హం. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్ గా, భారత సెలక్టర్ గా కూడా ఆయన సేవలు అందించాడు. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ లోకి ధోనిని తీసుకోవడంలో వీబీ కీలక పాత్ర పోషించడం గమనార్హం. కామెంటేటర్ గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు.