Begin typing your search above and press return to search.
వైసీపీలో చేరిన మరో మాజీ ఐపీఎస్!
By: Tupaki Desk | 25 Aug 2018 4:48 PM GMT2019 ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కు ప్రజాదరణ పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే వైసీపీలో చేరికలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ పొలిటిషిన్లు వైసీపీలో చేరగా....కొద్ది రోజుల క్రితం...ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, మరో ఐపీఎస్ అధికారి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు....ఈ రోజు వైసీపీలో చేరారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్ ను కలిసిన సాంబశివరావు...వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు నేడు కలిశారు. రాంబిల్లి మండలం హరిపురంలో పాదయాత్ర చేస్తోన్న జగన్ ను సాంబశివరావు కలిసి వైసీపీలో చేరారు. వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందన్నారు. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు గతంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 1987లో ఆదిలాబాద్ ఏఎస్పీగా బాధ్యలు చేపట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర విభజనానంతరం ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో మిరియాల పాలెం సాంబశివరావు స్వస్థలం. సామాన్య కుంటుంబం నుంచి వచ్చిన ఆయన డీజీపీ స్థాయికి ఎదిగి నేడు రాజకీయాల్లోకి వచ్చారు.