Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ పై మాజీ ఉద్యోగి లా సూట్!

By:  Tupaki Desk   |   11 Sep 2018 10:45 AM GMT
ఇన్ఫోసిస్ పై మాజీ ఉద్యోగి లా సూట్!
X
భార‌త్ లోనే రెండో అతి పెద్డ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ కు ఆ కంపెనీ మాజీ ఉద్యోగి షాకిచ్చాడు. అంత‌కుముందు త‌న‌కు రావాల్సిన 1000గంట‌ల‌ ఓవ‌ర్ టైం జీతాన్ని కంపెనీ చెల్లించ‌లేద‌ని ఆరోపిస్తూ ఇన్ఫోసిస్ పై కోర్టులో అనుజ్ క‌పూర్ అనే ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. గ‌తంలో తాను రోడ్ ఐలాండ్ లో సీవీఎస్ ప్రాజెక్ట్ కింద ప‌నిచేస్తున్న సంద‌ర్భంగా రోజుకు 11 గంట‌ల‌పాటు ప‌నిచేశాన‌ని, కానీ, కంపెనీ త‌న‌కు 8గంట‌ల ప‌నికి మాత్రమే జీతం చెల్లించింద‌ని ఆరోపించాడు. అంతేకాకుండా, ఓవ‌ర్ టైంకు డ‌బ్బులు చెల్లించేందుకు కూడా కంపెనీ నిరాక‌రించింద‌ని ఆరోపించాడు. తాను వారంలో 40 గంట‌ల‌పాటు ప‌నిచేయ‌కుంటే త‌న‌ను ఇండియాకు పంపేస్తాన‌ని....త‌న మేనేజ‌ర్ బెదిరించాడ‌ని ఆరోపించాడు.

అయితే, వాస్త‌వానికి అనుజ్ హెచ్ 1 బీ వీసా మీద అవ‌ర్లీ బేసిస్ మీద ప‌నిచేస్తున్నాడు. కానీ, అత‌డు త‌మ కంపెనీ ఉద్యోగి అని, అత‌డికి జీతం చెల్లిస్తున్నామ‌ని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబ‌ర్ కు ఇన్ఫోసిస్ త‌ప్పుడు స‌మాచార‌మిచ్చింది. ఈ క్ర‌మంలోనే అనుజ్...త‌న ఓవ‌ర్ టైం పేమెంట్ పై కోర్టుకు వెళ్లాడు. అయితే, 2008లో కూడా ఇన్ఫోసిస్ ఇటువంటి ఓవ‌ర్ టైం బ‌కాయిలు ఎగ్గొట్టిన‌ కేసును ఎదుర్కొంది. ఆ కేసులో ఇన్ఫోసిస్ .... 26 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల్సి వ‌చ్చింది. అదే త‌ర‌హాలో, తాజాగా ఇన్ఫోసిస్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌పై రోడ్ ఐలాండ్ అధికారులు విచార‌ణ చేపట్టారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇన్ఫోసిస్ కు జ‌రిమానా విధించే అవ‌కాశ‌ముంద‌ని అక్క‌డి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.