Begin typing your search above and press return to search.

తన ఫ్యూచర్ ప్లాన్ చెప్పిన గవర్నర్

By:  Tupaki Desk   |   4 Sep 2019 10:18 AM GMT
తన ఫ్యూచర్ ప్లాన్ చెప్పిన గవర్నర్
X
తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ కాలపరిమితి ముగిసిపోయింది. కేంద్రం నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు తమిళిసైను నియమించింది. నరసింహన్ కు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఈయన రిటైర్ అయిపోయినట్టే లెక్క. మరి ఉమ్మడి రాష్ట్రానికి క్లిష్ట సమయంలో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని కంట్రోల్ చేసి.. ఏపీ, తెలంగాణను విభజించి.. విభాజిత రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా చేసి.. ఇప్పుడు తెలంగాణకు దిగ్విజయంగా గవర్నర్ గా కొనసాగిన నరసింహన్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారే సందేహం కలుగడం సహజం. దీనిపై తాజాగా విలేకరుల సమావేశంలో నరసింహనే నోరు విప్పారు.

తెలంగాణ గవర్నర్ గా వైదొలిగాక ఆ రాష్ట్రానికి ప్రత్యేక సలహాదారుగా నియమిస్తారన్న వార్తలపై నరసింహన్ కొట్టిపారేశారు. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని నాకు తెలియదు అంటూ ముగించారు. గవర్నర్ గా రిటైర్ అయిపోయాక నేను చేసే పని పంచె-దోతి కట్టుకొని ఇడ్లి-దోశ తింటూ నా స్వేచ్ఛను అస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు.

ఇక తన జీవితంలో మెమరబుల్ మూమెంట్స్ పై కూడా గవర్నర్ స్పందించారు. ఉమ్మడి ఏపీలో నా ప్రసంగం ప్రతులను చించివేసిన వారితో కూడా ప్రమాణం చేయించడం నాకు బాగా అనిపించిందని.. నాధర్మాన్ని తాను నెరవేర్చానన్నారు.

ఇక తాను గుడికి పోవడంపై వ్యతిరేక వార్తలు రావడం చాలా బాధ అనిపించిందని.. పర్సనల్ లైఫ్ పై వార్తలు రాయడం బాధాకరమని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. గుడికి వెళితే తప్పేంటి అని మీడియా మిత్రులను ప్రశ్నించారు.

గవర్నర్ గా రిటైర్ అయ్యాక.. తాను రాజకీయాల్లోకి వెళ్లనని.. కేవలం నా పర్సనల్ జీవితానికే పరిమితం అవుతానని నరసింహన్ స్పష్టం చేశారు.