Begin typing your search above and press return to search.
మాజీ ఎమ్మెల్యే మనవళ్ళు కరోనాతో కన్నుమూత !
By: Tupaki Desk | 12 Aug 2020 2:00 PM GMTఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనవళ్లు కొత్త నరేష్ , కొత్త రామకృష్ణ కరోనా భారిన పడి కన్నుమూశారు.
కొత్త వెంకేటశ్వర్లు కుమారుడు కోటేవ్వర్ రావుకు ఇద్దరు కుమారులు ఉండగా, వారిలో సురేష్ పెద్దవాడు అతడు వ్యాపారం చేస్తున్నాడు. రామకృష్ణ వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అయితే వారిలో తొలుత సురేష్ కు కరోనా నిర్దారణ అయింది. దీనితో అతడు ఇంటివద్దనే చికిత్స తీసుకున్నాడు , ఇంట్లో అతనికి తన తమ్ముడు రామకృష్ణ సహాయంగా ఉన్నాడు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అతడు మృతి చెందాడు.
అన్నకి సేవలు చేసే సమయంలో రామకృష్ణ సైతం కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా పరిస్థితి విషమించడం తో అతడు కూడా కరోనాతో కన్నుమూశారు. ఇద్దరు కుమారులను కోల్పోవటంతో వారి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రామకృష్ణ మృతి పట్ల గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.వైసీపీలో క్రీయశీలకంగా పనిచేసిన రామకృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.