Begin typing your search above and press return to search.

అమరావతి ఎంపీకి కరోనా

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:34 PM GMT
అమరావతి ఎంపీకి కరోనా
X
మాజీ హీరోయిన్, పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ కి కరోనా సోకింది. ఆమెతో పాటు ఆమె ఇంట్లో 11 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. ఆ ఇంట్లో తొలుత నవనీత్ కౌర్ మామకు కరోనా సోకింది. ఆ తర్వాత వరుసగా ఆ ఇంట్లో వారు కరోనా బారిన పడ్డారు. గురువారం వెలువడిన యాంటీ జెన్ టెస్ట్ ఫలితాల్లో ఆమెకు కోవిడ్ నిర్దారణ అయ్యింది. ఆమె ఇంట్లో సీరియస్ గా ఉన్నవారంతా నాగ్ పూర్ లో చికిత్స తీసుకుంటున్నారు. మిగతా వారు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆమెతో పాటు దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ కౌర్ ఇంటిని అధికారులు శానిటైజ్ చేశారు. తమ ఎంపీ త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.

టాలీవుడ్లో హీరోయన్ గా పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ దేశంలో ఇండిపెండెంట్ గా గెలిచి సంచలనం సృష్టించారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఆమె ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆమె భర్త రవి రానా కుటుంబం రాజకీయాలకు సుపరిచతమే. అతను కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలను ఎదిరించి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.