Begin typing your search above and press return to search.

మొదటిసారి ఓ హైకోర్టు మాజీ జడ్జి అరెస్ట్

By:  Tupaki Desk   |   2 Dec 2020 4:30 PM GMT
మొదటిసారి ఓ హైకోర్టు మాజీ జడ్జి అరెస్ట్
X
ఇప్పటిదాకా జరగని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. హైకోర్టు జడ్జిలుగా పనిచేసిన వారంతా నీతి, నియమాలతో సమాజానికి ఆదర్శంగా నిలబడుతారు. కానీ మొదటిసారి ఓ హైకోర్టు మాజీ జడ్జి అరెస్ట్ కావడం కలకలం రేపింది.

మద్రాస్, కోల్ కతా హైకోర్టుల మాజీ జడ్జి సీకే కరణ్ ని బుధవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల భార్యలపైన మరియు మహిళా జడ్జిపైన సీకే కరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెంట్రల్ చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటికే సీకే కరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం మద్రాస్ హైకోర్టు.. కరణ్ పై దర్యాప్తు పురోగతిని వ్యక్తిగతంగా కోర్టుకు తెలుపాలని తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.

సీకే కరణ్ అప్పట్లోనే జడ్జిల భార్యలు,మహిళా లాయర్లు, మహిళా కోర్టు సిబ్బందిపై అత్యాచార బెదిరిపంపులు మరియు అసభ్య పదజాలంతో వారిని దూషించాడు. దీనిపై తమిళనాడు బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై పిటిషన్ వేసింది. దీనిపై ఈరోజు మద్రాస్ హైకోర్టు విచారణ చేసింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని,అటువంటి వ్యాఖ్యాలు చేసినందుకు ఆయనపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కౌన్సిల్ కోరింది. తాజాగా హైకోర్టు ఆదేశం మేరకు మాజీ జడ్జిని పోలీసులు అరెస్ట్ చేశారు.