Begin typing your search above and press return to search.
ఒకప్పటి ఇండియన్ క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త !
By: Tupaki Desk | 19 Aug 2021 11:30 AM GMTక్రీడాకారులు తమ పూర్తి జీవితాన్ని క్రీడలకే అంకితం చేస్తుంటారు. కొద్దో గొప్పో చదువుకుని క్రీడా రంగంలో అడుగుపెట్టి తాము ఎంచుకున్న ఆటల్లో అద్భుతంగా రాణిస్తుంటారు. మనం వారి ఆటను చూసి ఎంజాయ్ చేస్తాం కానీ వారు ఎంత చదువుకున్నారనేది ఎప్పుడూ ఆలోచించం. అయితే ఒక క్రికెటర్ మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యనభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యారు. మాజీ ఇండియన్ క్రికెటర్ అయిన ఆవిష్కార్ సాల్వి తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత విద్యావంతుల జాబితాలో ఒకరిగా నిలుస్తున్నారు సాల్వి. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు అంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా/ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్ డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితో పాటు ఓర్పు, సహనం ఉండాలి.
అలాగే, అత్యంత కష్టమైన ఫిజిక్స్, మేథమేటిక్స్ పాఠ్యాంశాలపై మంచి పట్టు సాధించాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో ఆవిష్కార్ ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్ డీ పూర్తి చేసి సంచలనం సృష్టించారు. ఆయన 2003లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసి 2 వికెట్లు పడగొట్టారు. అయితే , కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపిఎల్‌లో కూడా పాల్గొన్నారు.
39 ఏళ్ల సాల్వి తన పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్ గా మారారు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్ లో ఒకరిగా ఉన్నారు. దేశీయ మ్యాచ్ లలో ముంబయికి ప్రాతినిధ్యం వహించిన ఆయన 50 ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ ల్లో ఆడారు. దేశీయ మ్యాచ్ లలో రాణించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ కాలేకపోయారు. అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్, ఆర్. అశ్విన్, రాహుల్ ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే ప్రస్తుతం వారందరికంటే ఉన్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్' గా వెలుగొందుతున్నారు. గాయం కారణంగా క్రికెట్ ఆటను మధ్యలోనే వదిలేసిన సాల్వి ఆస్ట్రోఫిజిక్స్ లోనైనా రాణించాలని, దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుందాం.