Begin typing your search above and press return to search.

మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ సూసైడా? డెత్ మిస్టరీ.!

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:05 AM GMT
మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ సూసైడా? డెత్ మిస్టరీ.!
X
వీబీ చంద్రశేఖర్.. భారత జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్. ఈయన మరణంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు నివాళులర్పిస్తున్నారు. అయితే ఈయనది సహజ మరణం కాదని.. డెత్ మిస్టరీ అని తేలింది. ఈయన సహజంగా మరణించాడని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రస్తుతం బాడీని పోస్టుమార్టంకు పంపారు. నివేదిక వచ్చాక ఏ విషయం తేలనుంది.

తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ 1988-90 మధ్యకాలం భారత క్రికెట్ జట్టుకు ఆడాడు. ఏడు వన్డేలు ఆడి మొత్తం 88 పరుగులు చేశారు. సరిగా రాణించలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయి తిరిగి మళ్లీ జట్టులోకి రాలేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం అదరగొట్టాడు. 81 మ్యాచ్ ల్లో 4999 పరుగులు చేసి 43 సగటుతో ఆకట్టుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా తరుఫున ఇరానీ ట్రోఫీ ఇతడు 56 బంతుల్లో సెంచరీ సాదించి ఔరా అనిపించాడు. క్రికెట్ నుంచి రిటైర్అయిన తరువాత తమిళనాడు జట్టు కోచ్ గా, సెలెక్టర్ గా సేవలందించాడు. బీసీసీఐ ఈయన మృతి పట్ల సంతాపం తెలిపింది.

తాజాగా వీబీ చంద్రశేఖర్ సహజంగా మరణించారన్న వార్తల్లో నిజం లేదని.. ఆయన గుండెపోటుతో మరణించలేదని.. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నైలోని మైలాపూర్ లోని ఆయన స్వగృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆయన సూసైడ్ చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పంపిన పోలీసులు ఆ నివేదిక వచ్చాక ఆయన మరణంపై క్లారిటీ ఇస్తామని తెలిపారు.

అయితే కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో వీబీ కంచి వీరన్స్ జట్టును చంద్రశేఖర్ కొని ఆ జట్టు బాగా ఆడకపోవడంతో 3 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టి మునిగాడని చెబుతున్నారు. ఆ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోవడం.. తాజాగా బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో మనస్తాపం చెందిన తన బెడ్ రూంలో సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ ఏది వాస్తవమో తెలిసేలా లేదు.