Begin typing your search above and press return to search.

పిల్లలు చూస్తున్నారు కోహ్లీ మర్యదగా నడుచుకో : దీప్‌ దాస్‌గుప్తా !

By:  Tupaki Desk   |   13 July 2021 12:30 AM GMT
పిల్లలు చూస్తున్నారు కోహ్లీ మర్యదగా నడుచుకో : దీప్‌ దాస్‌గుప్తా !
X
విరాట్ కోహ్లీ... టీం ఇండియా క్రికెట్ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు. అయితే , కోహ్లీ బ్యాటింగ్ లో ఎంత పరిణితి చూపిస్తాడో , అంతే కోపం కూడా ప్రదర్శిస్తాడు. ఓటమిని ఎప్పటికి ఒప్పుకోడు. అయితే ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగి గేమ్ మొదలుపెడితే కోహ్లీ ని కొన్ని కోట్ల మంది చూస్తుంటారు , అలాగే కోహ్లీ ని అనుకరించే పిల్లలు కూడా అనేకమంది ఉంటారు. మైదానంలో కొంచెం మర్యాదగా నడుచుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత మాజీ సెలెక్టర్ దీప్‌ దాస్ గుప్తా సూచించాడు. ఎంతో మంది చిన్నారులు భారత కెప్టెన్‌ ను స్పూర్తిగా తీసుకుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నాడు.

కోహ్లీ ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు అతని సంబరాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. మ్యాచ్ గెలిచినంత ఆనందం మొఖం లో కనిపిస్తుంది. కోహ్లీ తన దూకుడుతో ఎప్పటికప్పుడూ తన టీమ్‌లో స్పూర్తిని నింపుతుంటాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు హద్దులు ధాటి కూడా ప్రవర్తిస్తుంటాడు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్‌ లో కోహ్లీ తన హవాభావాలతో హద్దులు దాటాడు. ప్రత్యర్థి వికెట్ తీసిన ఆనందంలో నోటీపై వేలు వేసుకుంటూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కోహ్లీ మర్యదాగా నడుచుకోవాల్సి అవసరం ఉందని తన యూట్యూబ్ చానెల్ వేదికగా దీప్‌ దాస్ గుప్తా సూచించాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ .... విరాట్ కోహ్లీ టీమిండియా అంబాసిడర్. అతన్ని ఎంతో మంది స్పూర్తిగా భావిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఆడుతున్నప్పుడు అతని ప్రభావం మరి ఎక్కువగా ఉంటుంది.

అయితే సౌతాంప్టన్‌లో అతను ఎలా ప్రవర్తించాడనే విషయం నాకు తెలియదు. కానీ అతను కొంచెం మర్యదాగా నడుచుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. దానికి నేను అంగీకరిస్తా. కొన్ని సార్లు అతను హద్దులు దాటుతాడు. ఎంతో పిల్లలు అతన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. మరెంతో మందికి చిన్నారులకు అతను రోల్ మోడల్. కాబట్టి కోహ్లీ కొంచెం హుందాగా నడుచుకోవాలని తెలిపాడు. ఇదిలా ఉంటే .. భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ ను ఇంగ్లండ్‌ కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని దీప్‌ దాస్‌ గుప్తా అన్నాడు. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ కోసం ఇద్దరు యువ ఓపెనర్లు దేవ్‌ దత్‌, పృథ్వీషా వెళ్తారనే చర్చ వారం, పదిరోజులుగా సాగుతోంది.

శ్రీలంక పర్యటనలో మ్యాచ్‌ లు ఆలస్యమవడంతో వాళ్లిద్దరూ ఈనెల 29 వరకు అక్కడే ఉంటారు. ఒకవేళ 30న ఇంగ్లాండ్‌కు బయలుదేరినా అక్కడ మరో పదిరోజులు హోటల్‌ క్వారంటైన్‌ లో ఉండాల్సిన పరిస్థితి. అది పూర్తయిన వెంటనే నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే వారు సన్నద్ధమవ్వడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. పడిక్కల్‌, షా టెస్టు క్రికెట్‌ ఆడి చాలా రోజులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు వెళ్లినా నాలుగో టెస్టు వరకు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు కోహ్లీసేనకు కొత్త ప్రశ్న ఎదురవుతుంది. కేవలం రెండు టెస్టుల కోసం వారిని అక్కడికి తీసుకెళ్లడం అవసరమా అనే సందేహం తలెత్తుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ వెళ్లిన టీం లో ఓపెనర్లు చాలామంది ఉన్నారు అని అన్నాడు.

ఇక ఇదిలా ఉంటే .. 2014లో భారత టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2017లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాడు. కానీ.. ఇప్పటి వరకూ అతని కెప్టెన్సీలో కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా టీమిండియా గెలవలేదు. దాంతో.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.