Begin typing your search above and press return to search.

ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా భారత మాజీ స్టార్ .. ఎవరంటే ?

By:  Tupaki Desk   |   9 Nov 2021 9:30 AM GMT
ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా భారత మాజీ స్టార్ .. ఎవరంటే ?
X
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌ కోచ్‌ గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ ను నియమించే అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రెండు ఐపీఎల్‌ సీజన్‌ లకు ప్రధాన కోచ్‌ గా అతడిని ఆర్సీబీ నియమించబోతుంది. అయితే, గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌ గా బంగర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021 తొలి దశలో ఆర్సీబీ కు ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్‌ ఫేజ్‌ కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మైక్ హెస్సన్ తత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు.

అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అతను ఐపీఎల్‌లో ముందు పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. 2014 నుంచి 2016 వరకు పంజాబ్ కింగ్స్‌ తరపున పనిచేశాడు. సంజయ్ బంగర్ భారత బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆయన స్థానంలో విక్రమ్ రాథోర్‌ని నియమించారు. 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఏడో నంబర్‌ లో బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయంపై చాలా వివాదం నెలకొంది.

ఈ నిర్ణయం సంజయ్ బంగర్ దేనని చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి అతడిని తొలగించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఇది టీమ్ మేనేజ్‌ మెంట్ నిర్ణయమని బంగర్ తరువాత తెలిపాడు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుచుకోవాలనే కలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ‘ఇంత పెద్ద ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద అవకాశం. నేను జట్టులోని అత్యంత అద్భుతమైన, ప్రతిభావంతులైన కొంతమంది సభ్యులతో కలిసి పనిచేశాను. ఈ బృందాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చేయాల్సింది చాలా ఉంది. కానీ, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌తో మేం బాగా పనిచేసి అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయిస్తాం అని తెలిపాడు. భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 650 పరుగులు చేసి 14 వికెట్లు తీశాడు. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్‌లో, అతను ఫస్ట్ క్లాస్‌లో 300, లిస్ట్ ఏలో 92, టీ20లో 31 వికెట్లు తీశాడు. అతను ఐపీఎల్‌లో కూడా ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లలో భాగమయ్యాడు