Begin typing your search above and press return to search.
పిజ్జా డెలివరీ బాయ్‌గా మాజీ ఐటీ మంత్రి !
By: Tupaki Desk | 25 Aug 2021 10:43 AM GMTగత కొద్ది రోజుల ముందు వరకు ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రణాళికలు అమలయ్యేలా చూసిన ఓ వ్యక్తి, కాలక్రమంలో బతుకుదెరువు కోసం మరో దేశంలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేయాల్సి వస్తున్నది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఈయన మరెవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాదత్. జర్మన్ నగరమైన లీప్ జిగ్ లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఈయన, పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నారు. ఆయన ఆఫ్గనిస్తాన్ మంత్రిగా ఉన్నప్పుడు తన దేశంలో సెల్ ఫోన్ నెట్ వర్క్ ను విస్తృతం చేశారు. అటువంటి మంత్రి మాజీ అయ్యాకా ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడం కోసం పిజ్జా డెలివరీ చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఘనీకి.. ఈయనకు మధ్య కొన్నఅంశాలపై వివాదం తలెత్తింది. అప్పట్లో ఆ వివాదాలు పెద్దగా మారడంతో అహ్మద్ షా తన పదవికి రాజీనామా చేశారు. తరువాత కొంతకాలం ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నారు. కానీ, అక్కడ ఉండలేని పరిస్థితిలో అయన జర్మన్ వలస వెళ్లిపోయారు. మొదట్లో కొంతకాలం బాగానే సాగింది. కానీ, తరువాత ఆయనకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయన పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. డెలివరీ పని చేయడానికి తానేమీ సిగ్గుపడటం లేదని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి, ఆయన జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో సైకిల్‌పై పిజ్జాను పంపిణీ చేస్తున్నారు.
ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన అధికారికంగా మొదలైంది. తాలిబాన్ మంగళవారం తన తాత్కాలిక ప్రభుత్వానికి పలువురు మంత్రులను ప్రకటించింది. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఒకప్పుడు తాలిబాన్ యొక్క ప్రత్యర్థి అయిన గుల్ అఘా షెర్జాయ్ ని ఆర్థిక మంత్రిగా ఈ సంస్థ నియమించింది. షెర్జాయ్ కందహార్ మొదటి గవర్నర్, తరువాత నంగర్ హార్. తాలిబన్లు తాత్కాలిక అంతర్గత మంత్రిగా సదర్ ఇబ్రహీం, తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా ముల్లా సఖౌల్లా మరియు ఉన్నత విద్యా మంత్రిగా అబ్దుల్ బారీని నియమించారు. సదర్ ఇబ్రహీంను తాత్కాలిక హోం మంత్రిగా చేశారు. అదే సమయంలో, ముల్లా షిరిన్ ను కాబూల్ గవర్నర్ గానూ, హమ్దుల్లా నోమానిని కాబూల్ మేయ ర్‌గా చేశారు. ఆఫ్ఘన్ మాజీ ఐటీ మంత్రికే ఇలా ఇబ్బందులు పడుతుంటే, తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం విడిచి వెళ్లిన సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.