Begin typing your search above and press return to search.

ఈ మాజీ సీఎం సింప్లిసిటీ చూశారా?

By:  Tupaki Desk   |   12 Oct 2016 4:43 AM GMT
ఈ మాజీ సీఎం సింప్లిసిటీ చూశారా?
X
ఒక్కసారి రాజకీయ నాయకుడిగా మారితే, ఒక ఎమ్మెల్యోనో - ఎంపీనో అయితే ఇక తరతరాలకు ఢోకా ఉండదు అనే అభిప్రాయం భారతదేశంలో పుష్కలంగా ఉందనేది జగమెరిగిన సత్యమే! ఇదే క్రమంలో ఎన్నికల ప్రచార సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ బిల్డప్ ల విషయంలో కూడా ఎవరూ ఏమి తగ్గే ప్రసక్తి లేదు! ఎవరికి వారే తమను వీఐపీ - వీవీఐపీ లుగా భావించుకుంటూ విలాసాలు కోరుతున్న రోజులివి. ఇక ముఖయమంత్రి హోదా వ్యక్తులు అయితే ప్రత్యేక విమానాలలో హల్ చల్ చేస్తున్నారు! అయితే తాజాగా ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రం అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్ క్లాస్ రైలు కంపార్ట్ మెంట్ లో ప్రయాణించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఒక ఫోటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

ఎవరూ ఊహించనిరీతిలో స్లీపర్ క్లాస్ లో రైల్లో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి - తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. డాబూ - దర్పాలకు పోకుండా కనీసంలో కనీసం ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా పోకుండా సామాన్యులతో సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయణం ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రశంసల పొందుతుంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ. పైగా కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత కూడా ఈయనకు సొంతం. ఆస్థాయిలో మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్‌ నాయకుడు 72 సంవత్సరాల వయసులో గత సోమవారం స్లీపర్‌ క్లాస్‌ లో 160 కిలోమీటర్లు ప్రయాణించి రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.

ఈ విషయాలపై స్పందించిన ఈ మాజీ సీఎం... తనకు పెద్దగా రద్దీ లేని స్లీపర్‌ క్లాస్‌ రైళ్లలో ప్రయాణించడమంటేనే ఇష్టమని, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్లోనే ప్రయాణిస్తానని చెబుతున్నారు. దీనివల్ల తన కంఫర్ట్ తో పాటు ప్రజలతో మమేకమవ్వొచ్చని, వీఐపీ - వీవీఐపీ అంటూ ప్రయాణిస్తే తనకు ఒంటరితనంగా తోస్తుందని, వీఐపీ అన్న భావనపై నమ్మకం లేదని చెబుతున్నారు. అయితే గత మే నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడంతో ఊమెన్‌ చాందీ సీఎం పదవి నుంచి దిగిపోయారు.

కాగా, విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, వీఐపీ లాంజ్‌ లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని కొందరు ఎంపీలు కొన్ని వారాల కిందట కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/